పవన్‌: బ్యాడ్‌న్యూస్‌.. గాజు గ్లాసు దక్కదా?

Chakravarthi Kalyan
గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం. గాజు పగిలే కొద్దీ పదును ఎక్కుతుంది అంటూ పవన్ కల్యాణ్ తన లేటేస్ట్ సినిమాలో ఈ డెలాగ్ చెప్పి మరీ పార్టీ గుర్తుపై ప్రచారం చేసుకుంటున్నారు.  ఇది జనసేన అభిమానులకు కూడా తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది.  తీరా చూస్తే నిజంగానే గాజు గ్లాసు బద్ధలయింది ఏమో అనిపిస్తోంది. ఎందుకంటే జనసేన పార్టీకి ఈసీ ఇచ్చిన షాక్ అలాంటిది మరి.  

ఇప్పటి వరకు జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్ ను ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. దీంతో జనసైనికులు ఆందోళనలో ఉన్నారు. జనసేన కేవలం రిజిస్టర్డ్ పార్టీ కావడం వల్ల గాజు గ్లాస్ ను ఆ పార్టీకి కేటాయించేందుకు ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల జాబితాతో పాటు గుర్తింపు లేని పార్టీల లిస్ట్ ను కూడా విడుదల చేసింది. బీజేపీ, కాంగ్రెస్ లు జాతీయ పార్టీలుగా.. వైసీపీ, టీడీపీలను  ప్రాంతీయ పార్టీలుగా గుర్తిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో జనసేనను రిజిస్టర్డ్ పార్టీగా గుర్తిస్తూ ఈసా తన గెజిట్ లో పేర్కొంది.

ఇదే క్రమంలో గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈసీ ఏమో గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. నిబంధనల ప్రకారం ఎవరైతే ముందుగా సింబల్ కోసం దరఖాస్తు చేసుకుంటారో వారికే ఈ గుర్తును ఈసీ కేటాయిస్తోంది. మేమే ముందు దరఖాస్తు చేసుకున్నామని ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరి ఈ గుర్తు విషయంలో హైకోర్టు ఏం తేలుస్తుందో చూడాలి.  ఇదిలా ఉండగా పవన్ ని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ఈ పిటిషన్ దాఖలు చేశారని విశ్లేషకులు అంటున్నారు. మరి దీని వెనుక సీఎం జగన్ ఉన్నారా.. లేక వ్యక్తిగత స్వార్థమో వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: