" అశోక్ అన్నా అంతా నీ ఇష్టం " ... మిథున్‌రెడ్డి స‌మ‌క్షంలో తేల్చేసిన జ‌గ‌న్‌..!

RAMAKRISHNA S.S.
" అశోక్ అన్నా అంతా నీ ఇష్టం... పార్టీకి ఏది మంచో.. ఇది చెడో అక్క‌డ లోక‌ల్‌గా నాకంటే నీకే బాగా తెలుసు.. ఏం చేసినా అక్క‌డ సీటు గెలిపించుకుని రావాలి " .. ఇది క్లుప్తంగా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. చింత‌ల‌పూడి నియోజ‌కవ‌ర్గ వైసీపీ కీల‌క నేత మేడ‌వ‌ర‌పు అశోక్‌బాబుకు చెప్పిన సందేశం. అస‌లు విష‌యంలోకి వెళితే చింత‌ల‌పూడి వైసీపీ అభ్య‌ర్థి కంభం విజ‌య‌రాజుకు, ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ వ‌ర్గం నేత‌ల‌కు కొద్ది రోజులుగా తీవ్ర‌మైన గ్యాప్ వ‌చ్చింది. తామంతా నాలుగేళ్ల పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు పోక‌డ‌ల‌కు వ్యతిరేకంగా ఎంతో పెద్ద పోరాటం చేసి విజ‌య‌రాజుకు సీటు వ‌చ్చేలా చేస్తే ఆయ‌న అదే ఎలీజా వ‌ర్గం వారిని ముందుకు తీసుకువెళుతుండ‌డం ఎంపీ వ‌ర్గం నేత‌ల‌తో పాటు ఆ వ‌ర్గంలో కీల‌కంగా ఉన్న అశోక్‌బాబుకు ఎంత మాత్రం న‌చ్చ‌లేదు.

ఈ క్ర‌మంలోనే నాలుగు రోజుల క్రితం విజ‌య‌రాజు తీరు నిర‌సిస్తూ ఎంపీపీ ప‌ద‌వికి అశోక్‌బాబు భార్య విజ‌య‌ల‌క్ష్మితో పాటు అశోక్‌బాబు, ఇటు ఆయ‌న వ‌ర్గం ప్ర‌జాప్ర‌తినిథులు, పార్టీ నేత‌లు త‌మ పార్టీ, ఇత‌ర ప‌ద‌వులు అన్నింటికి రాజీనామాలు చేసేశారు. దీనిపై నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ముస‌లం రేగింది. పార్టీ గ్రాఫ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వెంట‌నే జిల్లా పార్టీ కీల‌క నేత‌లు అంద‌రూ అశోక్‌తో ట‌చ్‌లోకి వ‌చ్చి చ‌ర్చించే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌కు మంగ‌ళ‌వారం చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్‌ను అశోక్ క‌లిశారు.

పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స‌మ‌క్షంలోనే చిన్న‌భేటీ కూడా జ‌రిగింది. అశోక్ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో పాటు పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు పాల్ప‌డి.. పార్టీని నాలుగేళ్ల‌లో న‌ష్ట‌ప‌రిచిన వారిని విజ‌య‌రాజు ఎంక‌రేజ్ చేస్తే ఎన్నిక‌ల్లో పార్టీ న‌ష్ట‌పోతుంద‌ని చెప్పారు. వెంట‌నే జ‌గ‌న్ మిథున్‌రెడ్డితో అశోక్ అన్న పార్టీకి అక్క‌డ చాలా ప్ల‌స్‌.. ఆయ‌న పార్టీకి న‌ష్ట‌ప‌రిచే చ‌ర్య‌లు ఎంత మాత్రం చేయ‌డు... పార్టీకి ఎవ‌రు ప్ల‌స్ అవుతారో వారంద‌రిని పార్టీలోకి తీసుకోవాల‌ని.. పార్టీని న‌ష్ట‌ప‌రిచే వారు మ‌న‌కు అవ‌స‌రం లేద‌ని ఆ నిర్ణ‌యాన్ని ఆయ‌న‌కే వ‌దిలేయాని నేరుగా చెప్పేశారు.

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రంగా ఉన్న చిన్న చిన్న డిస్ట‌బెన్సెల‌ను చూడాల‌ని కూడా జ‌గ‌న్ మిథున్‌రెడ్డితో చెప్పారు. అలాగే నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ గెలుపు, ఇత‌ర విషయాలు ఎలా ఉన్నాయ్ అన్నా అని కూడా జ‌గ‌న్ అశోక్‌ను అడిగి తెలుసుకున్నారు. మ‌రి అశోక్ వ‌ర్గం త‌న రాజీనామాల‌ను ఎలా ?  ఎప్పుడు వెన‌క్కు తీసుకుని ఎన్నిక‌ల కార్య‌క్షేత్రంలో యాక్టివ్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: