అక్కడ నుంచే పోటీ చేస్తున్న డా.బి.ఆర్..అంబేద్కర్ మనవడు.. !

Divya
అమరావతి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అని.. అయితే ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించకపోయినా.. టిడిపి నాయకులు, అమరావతి ప్రజలు మాత్రం అమరావతిని రాజధాని చేయాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఇది ఇలా ఉండగా మరొకవైపు ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.. ఇలాంటి సమయంలోనే అమరావతి నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనవడు , రిపబ్లిక్ సేన అధినేత.. ఆనందరాజు అంబేద్కర్ అసదుద్దీన్ పోటీ చేయబోతున్నారనే వార్త వైరల్ గా మారుతోంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ అమరావతి కాదు కానీ మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుండి ఓవైసీ నేతృత్వంలో ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తేహాదుల్ ముస్లిమీన్) పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ కి చెందిన బల్వంత్ వాంఖడే, వంచిత్ బహుజన్ అఘాడీ ప్రజాక్త పిల్లేవాన్, ప్రహార్ జనశక్తి పార్టీ నాయకుడు దినేష్ బబ్ ల సవాల్ తో సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ హీరోయిన్ నవనీత్ రాణా ను బిజెపి రంగంలోకి దించడంతో ఇప్పుడు అమరావతి పోటీ చాలా ఉత్కంఠ వరితంగా మారింది.. ఔరంగాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం నాయకుడు.. ఇంతియాజ్ జలీల్ మంగళవారం నాడు... అంబేద్కర్ మనవడు తన నివాసానికి వచ్చి.. ఎన్నికల్లో మద్దతు కోరారు అంటూ ట్వీట్ చేశారు.. ఎల్ ఎస్ ఎన్నికలలో ఆనందరాజ్ అంబేద్కర్ కి మద్దతు ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి తెలియజేస్తాము అంటూ జలీల్ పి టి ఐ తెలిపారు.

మరోవైపు ఆనంద్ రాజ్ సోదరుడు ప్రకాష్ అంబేద్కర్ మాట్లాడుతూ.. ఆనంద్ రాజు అంబేద్కర్ నా నివాసంలో విందు కోసం నన్ను కలిశారు.. అక్కడ మేము నేను లోక్ సభ ఎన్నికల గురించి చర్చించుకున్నాము.. అమరావతి లోక్సభ నియోజకవర్గంలో మద్దతు ఇవ్వాలని ప్రకాష్ అంబేద్కర్ నన్ను కోరారు అంటూ జలీల్ తెలిపారు. అంటూ ప్రకాష్ అంబేద్కర్ తెలిపారు..ఇక ఓవైసీ తో చర్చలు జరిపిన తర్వాత ఆనంద్ రాజు పార్టీ కోసం ఏఐఎంఐఐఎం బహిరంగ  ర్యాలీలు కూడా నిర్వహించవచ్చు అని ఆయన తెలిపారు.. మొత్తానికైతే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనవడు ఇప్పుడు బరిలోకి దిగడంతో సర్వత్రా ఉత్కంఠ బరిత వాతావరణం ఏర్పడింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: