ఏపీ: కొడుకు వ్యవహారం చూసి వైస్ ఆత్మ ఎంతో క్షోభిస్తుంది?

Suma Kallamadi
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగుదేశం పార్టీ కొట్టిన దెబ్బతో ఉమ్మడి ఏపీలో అప్పటికే దారుణమైన పరిస్థితులలో వున్న కాంగ్రెస్ పార్టీని విజయపథం వైపు నడిపిన మహా నేత రాజశేఖర్ రెడ్డి. ఓ సుదీర్ఘ పాదయాత్ర చేసి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. అందుకే కాంగ్రెస్ నాయకత్వం ఆయనను ఎప్పుడూ ప్రత్యేకంగా గౌరవించేది. ఈ క్రమంలోనే అయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఆయన అకాల మరణంతో జగన్ సీఎం పదవి ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ దానికి ఒప్పుకోలేదు. దీంతో జగన్ సొంతంగా తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేసి కొత్త పార్టీని విజయపధంలో నడిపించారు.
అయితే వైస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు మాత్రం తన ఉన్నతికి కారణమైన పార్టీని కుమారుడు వీడడంతో వైయస్ ఆత్మ తప్పనిసరిగా బాధపడుతుంది అని పార్టీని వీడిన మొదట్లో అనేవారు. ఇప్పటికీ అలా అనేవారు లేకపోలేదు. ఇక తాజాగా కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలు అయితే ఖచ్చితంగా వైయస్ ఆత్మను ఇబ్బందుల్లో నెట్టుతున్నాయి అనే విషయాన్ని పార్టీ శ్రేణులు కొంతమంది అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించి జగన్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పుడు, నిన్న రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టినప్పుడు జగన్ తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించినపుడు కుమారుడిని చూసి తప్పకుండా వైయస్ బాధపడి ఉంటారు అని గుసగుసలాడుకుంటున్నారు.
ఇకపోతే కుమారుడు జగన్ కంటే కుమార్తె షర్మిల అంటేనే రాజశేఖర్ రెడ్డికి ఎక్కువ ఇష్టమని అంతా చెప్పుకుంటూ వుంటారు. ఈ తరుణంలోనే తండ్రికి ఇష్టమైన కాంగ్రెస్ పార్టీలో చేరి.. అదే కాంగ్రెస్ పగ్గాలు ఆమె అందుకోవడం కొసమెరుపు. ఈ క్రమంలో ఆమె తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు కూడా చేశారు. దీంతో వైయస్ ఆత్మ ఎంతో శాంతించి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. తాజాగా ఆమె తండ్రి సమాధి వద్ద కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి విదితమే. తాను కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానని, అయితే ఇక్కడే రాజశేఖర్ రెడ్డి ఆత్మ సతమతమై ఉంటుందని, తన కుటుంబంలోనే ఇద్దరు వ్యక్తులు ముఖాముఖి పోటీకి దిగుతుండడాన్ని ఆయన జీర్ణించుకోలేరని చెప్పుకొచ్చారు. అన్నింటికీ మించి తన తమ్ముడు హత్యను అడ్డం పెట్టుకుని సాగుతున్న ఈ పోరుని చూసి కచ్చితంగా రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందని అభిమానులు బాధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: