కాంగ్రెస్‌కు బ్యాడ్ న్యూస్... తెలంగాణ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మూడో స్థానం ప‌క్కా...?

RAMAKRISHNA S.S.
పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు ఓటములపై సర్వేలు మొదలయ్యాయి. తాజాగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో జరిపిన సర్వేలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తప్పదని ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడనుండి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుమారుడు... గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ తరపున బరిలో దిగుతున్నాడు. మొదట యువ నేతకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ వంశీకృష్ణ ఎంపిక విషయంలో సొంత పార్టీ నాయకులే గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. నిన్నగాక మొన్న కండువా కప్పుకున్న వంశీకి టికెట్ ఇవ్వడంపై అక్కడి సీనియర్ నేతలు తీవ్ర సంతృప్తితో ఉన్నారు.

 
మరోవైపు ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంటులోని నియోజకవర్గాల్లో అన్నదమ్ములు వివేక్, వినోద్ ఎమ్మెల్యేలుగా పదవుల్లో ఉన్నారు. దీంతో ఓకే కుటుంబానికి మూడు టికెట్లు ఇవ్వడంపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఇది ఇలా ఉంటే గడ్డం వివేక్ నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకుండా కొడుకును గెలిపించుకోవడం కోసం ఫుల్ బిజీగా ఉన్నారనే ఆరోపణలు కూడా నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తున్నాయి. పెద్దపల్లి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓ స‌ర్వే సంస్థ‌ 13,500 శాంపిల్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది.


ఇందులో 41.61 శాతం ఓటర్లు బీఆర్ఎస్ వైపు ఉన్నట్టు తెలిసింది. బిజెపికి 34.53% శాతం ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ కు కేవలం 17.6 శాతం ఓటర్లు జై కొట్టారు. దీంతో గడ్డం వంశీకృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పెద్దపల్లి నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. వీరు గడ్డం ఫ్యామిలీకే ఎంపీ టికెట్ ఇవ్వడం పై గుర్రుగా ఉన్నారు. దీంతో ఆ ఓట్లు సైతం వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 
అదే జరిగితే గడ్డం వంశీకృష్ణ ఓడిపోగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఏమైనా వంశీకి ఏమైనా మద్దతు పెరుగుతుందా...? లేదా అన్నదానిపై కూడా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: