చీ దీన‌మ్మా జీవితం... సీఎం ర‌మేష్ టీడీపీ - జ‌న‌సేన టిక్కెట్లు మార్పించ‌డం ఏంట్రా బాబు..!

RAMAKRISHNA S.S.
ఏపీ బీజేపీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు అన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పడిపోయిన వెంటనే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపి కండువా కప్పుకున్నారు. వారంతా ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా చంద్రబాబుతో కలిసిమెలిసి.. అటు బాబు ప్రయోజనాలు, ఇటు తమ ప్రయోజనాల కోసం పనిచేస్తారన్న‌ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. సీఎం రమేష్ బీజేపీలోకి వెళ్లినా.. ఇప్పుడు చంద్రబాబు దయతోనే బీజేపీ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది.

వాస్తవంగా సీఎం రమేష్ ది కడప జిల్లాలోని ప్రొద్దుటూరు. నిజంగా ఆయన పొత్తులో భాగంగా పోటీ చేయాలి అనుకుంటే.. కడప జిల్లాలోనే రెండు పార్లమెంటు స్థానాలు.. కడప, రాజంపేట ఉన్నాయి. అవి రెండూ కాదని కూటమి ప్రభావం గట్టిగా ఉన్న అనకాపల్లి పార్లమెంటు సీటు నుంచి పోటీ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే తన పోటీ చేస్తున్న అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ, జనసేన అభ్యర్థులను కూడా సీఎం రమేష్ మార్పించే స్థాయిలో ఉన్నారంటే ఆయనకు బీజేపీలో కంటే టీడీపీ, జనసేన లోనే ఎక్కువ పవర్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

ర‌మేష్‌కు ప‌వ‌ర్ ఉంద‌న‌డం కంటే ర‌మేష్ చెపితే తలాడించే స్థాయికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగజారి పోయారు అనుకోవాలో ఏమిటో కూడా అర్థం కావడం లేదు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులు మార్పు కోసం సీఎం రమేష్ గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. మాడుగులలో టీడీపీ అభ్యర్థి పైలా ప్రసాద్ గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నారని.. ఆయన స్థానం లో బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన సీఎం రమేష్ పెట్టినట్టు తెలుస్తోంది.

అలాగే ఎల‌మంచిలో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ వేగం అందుకోలేకపోతున్నారని.. ఆయనకు బదులుగా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాలన్న ప్రతిపాదన రమేష్ పెట్టినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సీఎం రమేష్.. పైకి కాషాయ కండువా వేసుకున్నా.. లోపల ఆయన మనసు ఆయన మైండ్ అంతా తెలుగుదేశం చుట్టూనే తిరుగుతుందని అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: