ప్ర‌కాశం: ' టీడీపీ సాంబ ' నాయ‌కుడు కాదు.. ప్ర‌జా నాయ‌కుడు

RAMAKRISHNA S.S.
ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన నియోక‌వ‌ర్గం ప‌రుచూరు. ఇక్క‌డ నుంచి వైసీపీ ఇప్ప‌టి వ‌ర‌కు బోణీ కొట్ట‌లేదు. 2012లో పార్టీ పెట్టిన త‌ర్వాత‌.. వైసీపీ అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. కానీ, ప‌రుచూరులో మాత్రం ఇప్ప‌టికీ అనేక ప్ర‌య‌త్నాలు చేసినా పాగా వేయ‌లేక పోయింది. ఇక‌.. ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నికల్లోనూ వైసీపీ ప్ర‌యోగాలు చేసింది. అభ్య‌ర్థుల‌ను మార్చింది. అయినా.. గెలుపుపై మాత్రం ఆశ‌లు పుట్ట‌డం లేదు.

దీనికి కార‌ణం.. బ‌ల‌మైన పునాదులు వేసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు. ఇక్క‌డ నుంచి ఆయ‌న వ‌రుస‌గా మూడో సారి పోటీ చేస్తున్నారు. హ్యాట్రిక్ ఖాయం కాదు.. రాసిపెట్టుకోవాల్సిందేన‌ని ఇక్క డి ప్ర‌జ‌లు చెబుతున్నారు. దీనికికార‌ణం.. ఆయ‌న నాయ‌కుడు కాదు.. ప్ర‌జానాయ‌కుడిగా ఎద‌గ‌డ‌మేన‌ని చెబుతున్నారు. ఏక‌ష్ట‌మొచ్చినా.. ఏలూరి ఇక్క‌డే ఉంటున్నారు. ప్ర‌జ‌ల‌కు నేనున్నానంటూ.. సేవ చేస్తున్నారు. రైతుల్లో రైతుగా.. సామాన్యుల్లో సామాన్యుడిగా ఆయ‌న క‌లిసిపోతున్నారు.

ఏలూరికి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీలు, కులాలు, మ‌తాల‌తో సంబంధం ఉండ‌దు.. వ‌ర్గాలు అస్స‌లు ఉండ‌వు. దాదాపు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఏ పార్టీలో చూసినా గ్రూపుల గోలే ఎక్కువుగా ఉంటుంది. ప‌రుచూరులో సాంబ‌శివ‌రావు వీటికి అతీత‌మైన నాయ‌కుడు. ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోయి.. ప్ర‌తి ఒక్క‌రిని పేరు పేరునా ప‌ల‌క‌రించ‌డ‌మే ఆయ‌న బ‌లం. ఇదే గ‌త ఎన్నికల్లో ఏలూరికి విజ‌యం అందించింది. అయితే.. ఇప్పుడు ఈ సింప‌తీకి తోడు.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆయ‌న‌పై జ‌రిగిన దాడులు.. అరెస్టుల వ‌ర‌కు వ్య‌వ‌హారం సాగ‌డం.. ఓట‌ర్ల‌ను మ‌భ్య‌పుచ్చ డం.. త‌ప్పుడు కేసులు పెట్ట‌డం.. ఏలూరి వ్యాపారాల‌పై దాడులు చేయించ‌డం.. వంటివి స్థానికంగా చ‌ర్చ కు వ‌స్తున్నాయి.

ఇవ‌న్నీ తట్టుకుని బ‌ల‌మైన ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌పై పోరాటం చేసి త‌ట్టుకుని నిల‌బ‌డ్డార‌నే సానుభూతి ఏలూరిపై అమాంతం పెరిగిపోయింది. ఇది మ‌రింత‌గా ఆయ‌న‌కు ప్ల‌స్ కానుంది. ఇక‌, వైసీపీ ప‌రంగా చూస్తే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆమంచి కృష్ణ మోహ‌న్ ఉన్నారు. అయితే.. ఇక్క‌డి ప‌రిస్థితులు చూసి ఆన పోటీ నుంచి త‌ప్పుకున్నారు. అంత‌కుముందు ఇన్‌చార్జ్ రావి రామ‌నాథం బాబుకు ఏలూరిని ఢీ కొట్టే సీన్ లేద‌ని జ‌గ‌నే త‌ప్పించేశారు.

ఇక ఇప్పుడు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీతో విభేదించి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన ఎడ‌మ బాలాజీనే వైసీపీకి దిక్క‌య్యారు. ఆయ‌న‌కే టికెట్ ఎనౌన్స్ చేశారు. కానీ, ఆయ‌న కూడా ముందే చేతులు ఎత్తేశారు. ఆయ‌న‌కు ఎవ్వ‌రూ స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదు. దీంతో ఇక్క‌డ ఏలూరి హ్యాట్రిక్ త‌థ్య‌మ‌నే చ‌ర్చ గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల్లో బాగా వ‌చ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: