చంద్రబాబు: ఈసీ దెబ్బతో జగన్‌ మంచి ఏంటో తెలిసొచ్చిందా?

Chakravarthi Kalyan
వాలంటీర్ వ్యవస్థ మీద నాలుగన్నరేళ్లుగా విషం చిమ్మింది టీడీపీ. ఇప్పుడు ఏదో స్వచ్ఛందం సంస్థ ఫిర్యాదు మేరకు ఈసీ వాలంటీర్లను విధుల నుంచి దూరంగా ఉంచిందని అంటోంది. కానీ ఆ స్వచ్ఛంద సంస్థ లో ఉన్న వ్యక్తులు, వారికి టీడీపీతో ఉన్న సాన్నిహిత్యం చూసిన వారు ఎవరైనా ఇది టీడీపీ పని కాదంటే నమ్మకుండా ఉండలేరు.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ తప్పులు మీద తప్పులు చేస్తోంది. పేదలు ఎక్కువగా ఉన్న కుటుంబాలకు వాలంటీర్ వ్యవస్థ సేవలను అందిస్తోంది.  ఇది ఒక అతిపెద్ద డోర్ డెలివరీ సిస్టంగా మారింది. దాని వల్ల లాభాలను పొందుతున్న వర్గాలు సమాజంలో అనేకం ఉన్నాయి. వారిని చూసి అయినా టీడీపీ తన రాజకీయ కోణాన్ని మార్చుకుంటే బాగుండేది అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఒక వైపు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇంతకు మించి మెరుగైన జీవితాన్ని అందిస్తామని చెబుతూనే.. మరోవైపు వారి మెడ మీద కత్తిని వేలాడదీయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అని వారు తలలు పట్టుకుంటున్నారు. ఇక అవ్వాతాతల అలాగే అక్షరాలా అరవై లక్షల కుటుంబాలు ఉన్నాయని తెలుసుకొని ఇక మీదట జరగబోయే అతి పెద్ద రాజకీయ నష్టాన్ని ఊహించి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

సీఎస్ వద్దకు వెళ్లి త్వరగా పింఛన్లు అందేలా చూడాలని టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు సీఎస్ కి ఫోన్ చేశారు. కానీ దెబ్బ తిన్న అవ్వా తాతలకు, వాలంటీర్లకు తెలుసు కదా అసలు ఏం జరిగిందో. దీనినే అవకాశంగా మలుచుకున్న వైసీపీ భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తే జరగబోయేది ఇదే అని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అవ్వాతాతలు పింఛన్లు అందక నరకయాతన పడుతూ.. తమ ఈ పరిస్థితికి చంద్రబాబే కారణం అని భావిస్తున్నారు. ఏప్రిల్ లోనే కాదు. ఎండలు బాగా ముదిరే మేలో కూడా మండుటెండలో వృద్ధులు పింఛన్ల కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. మరి వారి ఆవేశం ఎవరి మీదకు తిరగబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: