మెదక్ : ట్రయాంగిల్ ఫైట్ లో.. గెలుపు ఎవరిది?

praveen
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయం ఎంతలా వేడెక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఇక మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతూ ఉన్నాయి. అయితే మరీ ముఖ్యంగా అటు కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఎంతో సెంటిమెంట్ గా భావించే కరీంనగర్, మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లపై ఎక్కువగా దృష్టిపెట్టాయి అన్నది తెలుస్తుంది. అయితే మెదక్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించాయి  బిజెపి నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, బిఆర్ఎస్ నుంచి మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి బీసీ నాయకుడు నీలం మధు బరిలోకి దిగనున్నారు.

 ఇక వీరి ముగ్గురి  మధ్య మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ట్రయాంగిల్ ఫైట్ కాస్త గట్టిగానే ఉంది అన్నది తెలుస్తుంది. అయితే గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు ఉంది. అంతేకాదు ఉద్యమ సమయంలో ఆయన ఎంతో కీలకంగా వ్యవహరించారు అన్న టాక్ కూడా అందరిలో ఉంది. ఇంకోవైపు ఆయన మంచి వ్యాఖ్యత. ఇక తన ప్రసంగాలతో ఓటర్లను ఇట్టే ఆకట్టుకోగలరు. సామాజిక అంశాలపై అనర్గళంగా మాట్లాడటమే కాదు.. గత ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎంతో సమర్థవంతంగా ఎత్తిచూపుతూ ప్రజల్లోకి తీసుకెళ్లగలరు.

 ఇక బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఆయన కలెక్టర్గా ఉన్న సమయంలో ఇక మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర వహించారు అనే మంచి పేరు కూడా ఉంది. అంతేకాదు ఇక ఇప్పుడు మెదక్ లోనే సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నారు. ఇలా తను స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటాను అన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు ఆయన. ఇలా ప్రజల్లో కలెక్టర్గా పని చేసిన సమయంలో తనకు వచ్చిన మంచి పేరు ఇక ఇప్పుడు ఎంపీగా తనను గెలిపిస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. ఇంకోవైపు బీసీ అభ్యర్థి నీలం మధు ఎన్నికలలో గతంలో పలుమార్లు పోటీ చేసిన విజయం సాధించలేకపోయారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన ఇక మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఇక మెదక్ లోనే నియోజకవర్గాలలో ఆయనకు కాస్త పట్టు తక్కువగానే ఉంది. కానీ ఆయన చేసిన సేవా కార్యక్రమాల కారణంగా ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంది. ఇక ఆయనకు ఉన్న ఈ ఫాలోయింగ్ ఆయనను గెలిపిస్తుంది కాంగ్రెస్ శ్రేణులు అనుకుంటున్నారట. ఇలా ముగ్గురు అభ్యర్థుల మధ్య ట్రయాంగిల్ ఫైట్ తీవ్రంగా జరుగుతుంది అన్నకు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: