గోదావరి: పొత్తే చిన్నమ్మకు సంకటంగా మారిందా..?

Divya
కూటమి పార్టీల పొత్తు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అగ్గిరాజేస్తోంది.. ముందుగా టిడిపి ఈ సీటు కోసం నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించింది.. ఆ తర్వాత అనపర్తి ని బిజెపి లాగేసుకోవడంతో.. టిడిపి కేడర్ అసంతృప్తి రగిలిపోతోంది. తెలుగు తమ్ముళ్లు ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. టిడిపి అభ్యర్థిని బిజెపిలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ కూడా ఒక కొత్త వార్త తెరపైకి వచ్చింది.. మరి ఇలాంటి తరుణంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన భవిష్యత్తును పరీక్షించుకోబోతున్నారా అంటే అవుననే చెప్పాలి..

ఆంధ్రప్రదేశ్లో బిజెపి,  జనసేన, టిడిపి పార్టీలు కూటమిగా ఏర్పడగా.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పొత్తు సవ్యంగా సాగుతున్నా.. అనపర్తిలో మాత్రం అగ్గి రాజేసింది. టిడిపి వ్యతిరేకతకు వేదికయింది. ముందుగా జనసేన, టిడిపి పొత్తు తర్వాత తొలి జాబితాలో సైకిల్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ప్రకటించింది.. ఇక బిజెపి కూడా కూటమిలో చేరడంతో అనపర్తి సీటును ఆ పార్టీ నేత శివరామ కృష్ణంరాజుకు సీటును కేటాయించింది. ఈ పరిణామం సైకిల్ పార్టీకి ఆగ్రహాన్ని తెప్పించింది. అధినాయకత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ముళ్లు రోడ్డుకెక్కారు. పార్టీ జెండాలు, కరపత్రాలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు కొంతమంది ఆత్మహత్యాయత్నం చేయడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఓదార్చడంతో సమస్య కాస్త సద్దుమణిగింది. కానీ నియోజకవర్గంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. 42 ఏళ్ల పాటు పార్టీ జెండాను మోసిన కార్యకర్తలే నేడు అధినాయకత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
అంతేకాదు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిపించుకుంటామంటూ టిడిపి కేడర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండియా హెరాల్డ్ కి అందిన సమాచారం మేరకు.. చంద్రబాబు ఫోన్లో మాట్లాడి సముదాయించినట్లు సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చిన్న రాజప్ప, వేగుళ్ల జోగేశ్వర రావు తో పాటు టిడిపి జోనల్ కోఆర్డినేటర్ కృష్ణ రంగారావు ఈయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ తర్వాత రామకృష్ణారెడ్డి బాపట్లలో చంద్రబాబును కలిసి చర్చలు జరిపారు.. నల్లమిల్లి ఏం చెప్పారు ? చంద్రబాబు ఏం హామీ ఇచ్చారు?  అనే విషయాలు అనపర్తి నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి.
న్యాయం కోసం నల్లమిల్లి పేరుతో నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు.. ఈ మేరకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి ఫోటోతో వృద్ధురాలైన తన తల్లి సత్యవతిని రిక్షా ఎక్కించుకొని భార్య , ఇద్దరు పిల్లలతో కలిసి ప్రజల్లోకి వెళ్తున్నారు. నియోజకవర్గంలో టిడిపిని బ్రతికించుకునేందుకు చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరొకవైపు ప్రస్తుతం నల్లమిల్లిని బిజెపిలోకి తీసుకొచ్చే టాక్ నడుస్తోంది. కమలం అభ్యర్థి పోటీ చేయాలని ఆ పార్టీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.కానీ ఇండియా హెరాల్డ్ కు అందిన సమాచారం మేరకు.. టిడిపి వదిలి బిజెపిలోకి వస్తారా అని అడగ్గా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టిడిపిని వదిలే ప్రసక్తే లేదని చెప్పినట్లు సమాచారం.. ఒకపక్క సీటు కోల్పోవడం ప్రజలు కూడా ఈయనకే బ్రహ్మరథం పడుతుండడంతో..ఈ సీటు వ‌ల్లే రాజ‌మండ్రి పార్ల‌మెంటుకు పోటీ చేస్తోన్న పురందేశ్వ‌రి గెలుపు క‌ష్టం అన్నట్టుగా తెలుస్తోంది.. నల్లమిల్లి పార్టీ సీట్ పొందితే పురందేశ్వరి విజయం ఖాయం.. మరి చంద్రబాబు ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.. మొత్తానికి అయితే అనపర్తి నియోజకవర్గంలో పొత్తే చిన్నమ్మకి సంకటంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: