ఏపీ : జగన్ శ్రీలంక చేస్తే.. మరి మీ సంగతేంటి బాబూ..?

Divya
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ పలువురు టిడిపి నాయకులతో పాటు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు విమర్శించడం జరిగింది.. ఇందుకు రామోజీరావు కూడా తన వంతు సహాయం చేశారు.. ఇప్పుడు ఇండియన్ హెరాల్డ్ కు తెలిసిన సమాచారం మేరకు.. వైయస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో 52,700 కోట్ల రూపాయల ఖర్చు ప్రతియేడాది చేస్తుందని ఒకవేళ చంద్రబాబు అదృష్టం కలిసొచ్చి అధికారంలోకి వస్తే.. జగన్ అమలు చేస్తున్నటువంటి పథకాలను రద్దు చేసే అవకాశం ఉండదట..

అంతేకాకుండా వాటిని రద్దు చేస్తే ప్రజలలో తిరుగుబాటు కచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అందువల్ల ఆ మొత్తాన్ని సైతం చంద్రబాబు భరించాల్సి ఉంటుంది.. ఇలాంటి సమయంలోనే మళ్ళీ పింఛన్ పెంచుతానంటూ కూడా తన హామీలలో ప్రకటించుకున్నారు.. ఇటీవల చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి అంటే ప్రతి ఏడాది కూడా కచ్చితంగా 74 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుందట.. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు మొత్తం అయ్యే ఖర్చు ఏడాదికి..1.4 లక్షల కోట్లు అవుతుందట.

ఈ మొత్తాన్ని చంద్రబాబు ఎలా సేకరిస్తారనే ప్రశ్న ఇప్పుడు ప్రజలలో మొదలవుతోంది.. ఏపీ సీఎం జగన్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుందంటూ ఎన్నోసార్లు విమర్శించిన చంద్రబాబు.. తాను ఏ విధంగా వాటిని అమలు చేస్తారో చెప్పాలంటూ ప్రజల సైతం చంద్రబాబుకు ప్రశ్నలు వేస్తున్నారు.. ముఖ్యంగా జగన్ శ్రీలంక చేస్తాడు సరే.. చంద్రబాబు ఏం చేస్తారో ఆ నిధులను ఎలా సమీకరిస్తారో సమాధానం చెప్పాలి అంటూ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు.. ఈ విషయాలకు క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలంటూ ప్రజలు అటు రాజకీయ నాయకులు అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: