పల్నాడు: జగనొచ్చినా, బాబోచ్చినా... ప్రజల పరిస్థితి మారేదేలే?

FARMANULLA SHAIK
నిజం ఎప్పుడు చాలా చేదుగా ఉంటది అనేది ఎప్పటినుండో వస్తున్నా సూక్తి లాంటిది అది మనమందరికి తెల్సిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో భాగం గా మనం అలాంటి సూక్తిని ఈరోజు గుర్తుచేసుకోవాల్సి వచ్చింది.కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి ఫ్యాక్షన్ నీడల్లో అలానే ఉన్నాయి ఇంకా మారలేదు.మాములుగా ఐతే పత్రికలు అలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి కానీ ఏదో ఒక పార్టీ కి కొమ్ము కాస్తుంటే అలాంటి విషయాలు ఎప్పటికి బయటకి రావు మరియు నిజం ఎప్పటికి గెలవడు అలాంటి సిట్యువేషన్సలో.
తాజాగా ఇలాంటి సంఘటనే జరుగుతుంది పిన్నెల్లి అనే గ్రామంలో. పిన్నెల్లి, పల్నాడు జిల్లాలోని మాచవరం మండలానికి చెందినది ఈ గ్రామం. ఇది మండల కేంద్రమైన మాచవరం నుండి 5 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన పిడుగురాళ్ళ నుండి 20 కి.మీ. దూరంలోనూ ఉంది.ఈ గ్రామం మాచర్ల నియోజక వర్గం కిందకి వస్తుంది.అక్కడ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డి పై గెలిచారు. అలాగే 2024 లో జరగబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి పై టీడీపీ అభ్యర్థి జులకంటి బ్రాహ్మనందరెడ్డి బరిలో ఉన్నారు.
ఇక్కడ ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంటున్నది. అదేంటంటే ఇక్కడ ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్లు మాత్రమే మెజారిటీగా ఆ ఊరిలో ఉంటారు.మిగిలిన వాళ్లు ఆ ఊరు వదిలి వెళ్తుంటారు.ఎందుకంటె అలా గెలిచినా వాళ్ళల్లో కొంతమంది వేరే వాళ్ళని రెచ్చగొట్టి గొడవలకి దిగేలా చేస్తారు చివరికి అది ఎక్కడిదాకాపోతుంది అంటే నాన్ బెయిల్ కేసులు దాక పోటుంది. ఒక్కోసారి చంపుకునేదాకా పోతుంది.కనుక అలా వెళ్లిన వాళ్లు వేరే వేరే ప్రాంతాలకు పోయి మరలా ఎన్నికల వేళ వస్తుంటారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చినాక దాదాపు అరవై కుటుంబాలు వెళ్ళిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: