ఏపీ : చంద్రబాబును కాదని.. ఆయన జగన్ చెంతకు చేరిపోయాడు?

praveen
ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ కూడా గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడమే కాదు.. గెలుపు గుర్రాలను బరిలోకి దింపబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలాగానే ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీల నుండి టికెట్ తమకే వస్తుందని ఆశపడిన ఎంతోమందికి నిరాశ ఎదురయింది. దీంతో ఉన్న పార్టీకి రాజీనామా చేసి ఇక పక్క పార్టీలోకి వెళ్తూ ఉండడం కూడా ఆంధ్ర రాజకీయాల్లో కనిపిస్తుంది.

 అయితే ఇప్పటికే జగన్ ను ఓడించేందుకు  జనసేన బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని టిడిపి ముందుకు సాగుతున్న సమయంలో ఇక ఇప్పుడు ఆ పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలింది. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా టిడిపికి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ సమక్షంలో వైసిపి గూటికి చేరుకున్నారు. కదిరి టికెట్ తనకే వస్తుందని చాంద్ బాషా అనుకున్నారు. కానీ అధిష్టానం మాత్రం అతనికి మొండి చేయి చూపించి.. వెంకట ప్రసాద్ ను అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో చాంద్ బాషా టీడీపీకి రాజీనామా చేశారు.

 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి కదిరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అత్తార్ చాంద్ భాషా విజయం సాధించారు. తర్వాత పార్టీ మారారు. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపిలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లోను టిడిపి టికెట్ ఆశించగా చంద్రబాబు మాత్రం వెంకట ప్రసాద్ కు కేటాయించారు. ఇక 2024 ఎన్నికల్లో అయిన అవకాశం ఇస్తారని ఎంతో ఆశగా ఎదురు చూడగా.. మరోసారి మొండి చేయి ఎదురయింది. దీంతో చివరికి టిడిపికి రాజీనామా చేసేసాడు. మంత్రి పదవితో పాటు తగిన గుర్తింపు ఇస్తామని చంద్రబాబు మాట ఇచ్చి తప్పాడని చాంద్ భాషా విమర్శలు గుప్పించాడు. అయితే ఇటీవలే బస్సు యాత్ర సందర్భంగా కదిరి వచ్చిన సీఎం జగన్  పార్టీ కండువా కప్పి చాంద్బాషాను వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: