మెదక్ : నేను పక్కా లోకల్ అంటున్న రఘనందన్?

praveen
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా పావులు కదుపుతున్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బిఆర్ఎస్ నుండి కీలక నేతలు అందరిని కూడా తమ పార్టీలు చేర్చుకుంటూనే ఇంకోవైపు ఇక పార్లమెంట్ ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలను దింపడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాడు సీఎం రేవంత్.

 అయితే ప్రస్తుతం ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం పూర్తిస్థాయిలో ప్రారంభం కానేలేదు.. అటు మెదక్ పార్లమెంట్ స్థానంలో మాత్రం రాజకీయం అంతకంతకు వేడెక్కుతుంది. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆ తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా వెంకటరామిరెడ్డిని ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే వెంకట్రాంరెడ్డి, రఘునందన్ రావు మధ్య లోకల్ నాన్ లోకల్ అనే వార్ పుట్టుకు వచ్చింది. నాన్ లోకల్ అయిన వెంకటరామిరెడ్డి కి ఎలా ఎంపీ టికెట్ ఇస్తారు.. సీఎం కేసీఆర్ నాన్ లోకల్ వాళ్లకి టికెట్ ఇచ్చి ఏకంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లను పిచ్చోళ్లను చేస్తున్నాడు అంటూ రఘునందన్ రావు ఇటీవల బీజేపీ కార్యకర్తల సమావేశంలో వెంకట్రాంరెడ్డి పై విరుచుకుపడ్డాడు.

 ఇంకోవైపు అటు బిఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి సైతం రఘునందన్ రావుకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నన్ను లాన్ లోకల్ అన్న వ్యక్తి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉండడం లేదు. కానీ తాను మాత్రం మెదక్ పార్లమెంట్ పరిధిలోనే సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడ నివసిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. మెదక్ లో ఎంతో మంది బీజేపీ సీనియర్లు ఉండగా రఘునందన్ రావుకి ఎలా టికెట్ ఇచ్చారు.. ఇలా రఘునందన్ కి టికెట్ రావడం వెనక ఏం జరిగిందో అందరికీ తెలుసు అంటూ వెంకటరామిరెడ్డి కౌంటర్ ఇస్తున్నాడు. అదే సమయంలో లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడుతున్న రఘునందన్ రావు.. మల్కాజ్గిరి పార్లమెంట్ తో ఎలాంటి సంబంధం లేని నాన్ లోకల్ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ కు ఎంపీ అభ్యర్థిగా ఎలా అవకాశం ఇచ్చిందో సమాధానం చెప్పాలి అంటూ బిఆర్ఎస్ శ్రేణులు సైతం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: