ఉత్త‌రాంధ్ర‌: సాధార‌ణ టీడీపీ కార్య‌క‌ర్త‌కు పార్ల‌మెంటులో అడుగుపెట్టే అదృష్టం ఉందా..?

RAMAKRISHNA S.S.
ఉత్త‌రాంధ్ర‌లోని కీల‌క‌మైన విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు స్థానం నుంచి టీడీపీ త‌మ పార్టీ అభ్య‌ర్థిగా ఎవ‌రిని పోటీలోకి దింపుతుందా అని రెండు నెల‌లుగా పెద్ద స‌ప్పేన్సే నెల‌కొంది. ఈ టైంలో చాలా పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియ‌ర్ నేత అశోక్ గ‌జ‌ప‌తిరాజుతో పాటు త్రిబుల్ ఆర్ ను కూడా లైన్లో పెడ‌తార‌ని అనుకున్నారు. అయితే అనూహ్యంగా పార్టీలో సాధార‌ణ నేత‌గా ఉన్న క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు అభ్య‌ర్థిత్వాన్ని చంద్ర‌బాబు ఖ‌రారు చేశారు.
2004లో పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎచ్చెర్ల ఏఎంసీ చైర్మ‌న్‌గా ప‌నిచేసిన అప్ప‌ల‌నాయుడు ఆ త‌ర్వాత క‌న్నెధార కొండ ఉద్య‌మం ద్వారా కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ప్ర‌జా పోరాటాలు చేసి మంచి లీడర్ అనిపించుకున్నారు. ఇక 2019 ఎన్నిక‌ల టైంలోనే అప్ప‌ల‌నాయుడు ఎచ్చెర్ల సీటు ఆశించారు. అయితే అప్పుడు క‌ళా వెంక‌ట్రావు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా, మంత్రిగా, ఇటు ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా పాతుకుపోయి ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఎచ్చెర్ల జ‌నాలు క‌ళాను సైడ్ చేయ‌డం మొద‌లు పెట్టేశారు.
క‌లిశెట్టి గ‌త నాలుగేళ్లుగా నిత్యం ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోయే ప్ర‌య‌త్నం చేశారు. రెండేళ్ల ముందు నుంచే ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ్రామంలో ప‌ర్య‌టిస్తూ .. ప్ర‌తి ఇంటికి వెళుతూ ఎచ్చెర్ల టీడీపీ అంటే క‌లిశెట్టి అనేలా పేరు తెచ్చుకున్నారు. కొంద‌రు త‌ప్పా నియోజక‌వ‌ర్గంలో మెజార్టీ కేడ‌ర్ క‌లిశెట్టిని కోరుకున్నారు. అయితే బీజేపీతో పొత్తు నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఎచ్చెర్ల సీటును ఆ పార్టీకి కేటాయించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అస‌లు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏంట‌ని క‌లిశెట్టి ఆవేద‌న‌లో ఉన్న టైంలో ఊహించ‌ని ల‌క్కీ ఛాన్స్ దొరికేసింది.
అప్ప‌ల‌నాయుడును ఏకంగా విజ‌య‌న‌గ‌రం పార్లమెంటు సీటుకు టీడీపీ అభ్య‌ర్థిగా అధిష్టానం ప్ర‌క‌టించింది. అటు మ‌రో సీనియ‌ర్ నేత క‌ళా వెంక‌ట్రావును చీపురుప‌ల్లి నుంచి రంగంలోకి దింపింది. సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా ఉన్న అప్ప‌ల‌నాయుడు అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తే.. అది పొత్తులో మిత్ర‌ప‌క్ష పార్టీ త‌న్నుకుపోవ‌డం.. ఇలాంటి టైంలో ఊహించ‌ని విధంగా పార్లమెంటు టిక్కెట్ రావ‌డంతో అప్ప‌ల‌నాయుడు ఆనందంతో ఉబ్బిత‌బ్బ‌వుతున్నారు. త‌న‌లాంటి సాధార‌ణ కార్య‌క‌ర్త‌కు పార్టీలో ఏకంగా ఎంపీ టిక్కెట్ ఇవ్వ‌డం చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో బీసీల‌కు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందో మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింద‌ని ఆయ‌న చెపుతున్నారు. మ‌రి విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు కోట‌పై టీడీపీ జెంగా స‌గ‌ర్వంగా ఎగ‌రేసి అప్ప‌ల‌నాయుడు ఢిల్లీ పార్ల‌మెంటులో అడుగు పెడ‌తారో ?  లేదో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: