గోదావ‌రి: వైసీపీ Vs టీడీపీ.. ఇద్ద‌రు ఉద్దండుల పోరులో ఈ సారి పై చేయి ఎవ‌రిది...!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలలో కీలక నేతలు.. సీనియ‌ర్ నేతలు.. మాజీ మంత్రుల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. అలాంటి నియోజకవర్గాలలో పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం ఒకటి. ఇక్కడ నుంచి తెలుగుదేశం త‌ర‌పున మాజీమంత్రి పితాని సత్యనారాయణ .. వైసీపీ మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు మధ్య ఉత్కంఠ భరిత పోరు జరగనుంది. 2019 ఎన్నికలలో వైసిపి నుంచి పోటీ చేసిన రంగనాథరాజు అప్పుడు మంత్రిగా ఉన్న పితానిపై విజయం సాధించి జగన్ ప్రభుత్వంలో తొలి మూడేళ్లపాటు మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆచంటలో ఎవరు గెలుస్తారు ? అన్నది చూస్తే పితానికి స్వల్ప ఆధిక్య‌త‌ కనపడుతున్న మాట వాస్తవం.

రంగనాథరాజుపై నియోజకవర్గ ప్రజలలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన మంత్రిగా ఉన్న పెద్దగా చేసింది ఏమీ లేదన్న అపవాదు కూడా మూటగట్టుకున్నారు. దీనికి తోడు జనసేన - టిడిపి - బిజెపి పొత్తు నేపథ్యం కూడా ఆచంట నియోజకవర్గంలో బలంగా ప్రభావం చూపనుంది. మామూలుగానే బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గం పితాని వైపు మొగ్గు చూపుతూ ఉంటుంది. గత ఎన్నికలలో పితానికి సొంత కులం వాళ్ళు దెబ్బ వేయడంతో ఆయన ఓడిపోయారు.
అయితే ఈసారి నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపులు .. శెట్టిబలిజలు దీనికి తోడు క్షత్రియులు ఆచంట మండలంలో ఉన్న కమ్మ‌ సామాజిక వర్గం కూడా వన్ సైడ్ గా కూటమి వైపు కొమ్ముకాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రంగనాథరాజుకి ఈసారి సీటు ఇవ్వ‌రని ... ఇక్కడ నుంచి బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపుతారని ముందు ప్రచారం జరిగింది. అయితే జగన్ చివరకు రంగనాథరాజుకే సీటు ఇచ్చారు. వైసీపీలోనే రంగనాథరాజుకు సీటు ఇవ్వడం చాలామందికి నచ్చటం లేదు. వారంతా రంగ‌నాథ రాజు కు ఎంత వ‌ర‌కు స‌పోర్ట్ చేస్తార‌న్న‌ది అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అంతు ప‌ట్ట‌ని ప‌రిస్థితే అంచంట లో క‌నిపిస్తోంది.

ఏది ఏమైనా సీనియర్ నేతలుగా ఉన్న ఈ ఇద్దరు మాజీ మంత్రుల పోరులో ప్రస్తుతానికి పితానికైతే స్వ‌ల్ప మొగ్గు కనిపిస్తోంది. ఇంకా చెప్పాలి అంటే టిడిపి - జనసేన - బిజెపి కూటమి చాలా బలంగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గం నర్సాపురం కూడా ఒకటి. ఆచంటతో పాటు నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గా ల‌లో కూటమి చాలా బలంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: