గోదావ‌రి: చంద్ర‌బాబుపై మాగంటి ధిక్కార స్వ‌రం... య‌న‌మ‌ల ఫ్యామిలీని ఫుట్‌బాల్ ఆడేశారుగా..!

RAMAKRISHNA S.S.
టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి మాగంటి బాబు టిడిపి అధినేత చంద్రబాబుపై ధిక్కారస్వరం వినిపించినట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో మాగంటి బాబు ఏలూరు నుంచి మరోసారి లోక్సభకు పోటీ చేయాలని అనుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇవే తనకు చివరి ఎన్నికలు అని.. తన ఇద్దరు కుమారులను కోల్పోయిన బాధలో ఉన్న తాను ప్రజాసేవకే అంకితం కావాలని అనుకుంటున్నానని ఈ ఒక్కసారి తనను గెలిచి పార్లమెంటుకు పంపిస్తే ఏలూరు పార్లమెంటు ప్రజలకు సేవ చేసుకోవడంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా సహకారాన్ని తాను ఎంపీగా ఉన్నప్పుడే నెరవేర్చుకోవాలని చెప్తూ వచ్చారు.

అయితే చంద్రబాబు మాగంటి బాబుకు మాట మాత్రం అయినా చెప్పకుండా ఏలూరు పార్లమెంటు స్థానాన్ని టిడిపి సీనియర్ నేత.. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్ యాదవ్ కు కేటాయించారు. దీంతో మాగంటి బాబు గత కొద్దిరోజులుగా చంద్రబాబుపై గరం గరం లాడుతున్నారు. ఒకానొక దశలో ఆయన వైసీపీలోకి వెళ్లిపోతున్న ప్రచారం కూడా జరిగింది. గత రాత్రి తన సతీమణి ప‌ద్మ‌వ‌ల్లీ దేవితో కలిసి చంద్రబాబుతో మాగంటి బాబు సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన అనంతరం మాగంటి తన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పోస్ట్ చేశారు.

ఇందులో చంద్రబాబుపై దిక్కారాస్వరం వినిపించడంతోపాటు తనకే లోక్సభ సీటు కావాలని కోరారు.. అలాగే తన అభిమానుల నుంచి కూడా సలహాలు.. సూచనలు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఈ మెసేజ్ సారాంశం ఈ క్రింది విధంగా ఉంది.

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానీకానికి,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు MRC అభిమానులకు నమస్కారం.. నిన్న రాత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో నా సతీమణితో కలిసి పాల్గొన్న చర్చల వివరాలను మీకు తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారితో చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మన సీట్ ఎందుకు మార్చారు మనల్ని ఎందుకు ఇంత అవమానించారు అనే అంశంపై చంద్రబాబు గారితో గట్టిగానే మాట్లాడటం జరిగింది.

- అసలు బీసీ అనే మాటను ఎందుకు ప్రచారంలోకి తీసుకొచ్చారు,ఎవరైనా బీసీ లు మాకు ఏలూరు పార్లమెంట్ సీట్ కావాలని అడిగారా? ఇది కేవలం మాకు పొగ పెట్టడం కాదా?
- ముఖ పరిచయం మరియు రాజకీయ అనుభవంలేని వ్యక్తిని చరిత్ర కల్గిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎలా నిలబెడతారు ?
- బీసీ వర్గానికి ఇవ్వాలనుకుంటే యనమల కుటుంబం తప్ప మిగిలిన వారు కనబడలేదా? 4 సీట్లు ఒకే కుటుంబంలో ఇస్తే మిగతా బీసీ కులాలు అంగీకరిస్తారా?అసలు మాకు మాట మాత్రమైనా చెప్పాల్సిన పనిలేదా?
- అసలు పార్టీకి అయన చేసిన సేవలు ఏంటి? నేను చేసిన సేవలు ఏంటి? మీకు తెలియవా?

మొదలైన ప్రశ్నలను అధినేత ముందు వుంచడం జరిగింది,కొంతకాలంగా పార్టీలో నాకు జరిగిన అవమానాలు గుర్తు చేశాను,పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ వున్న కారణంగా స్థానికుడు అయితే బాగుంటుంది అని చెప్పాను,మా సీట్ మాకు ఇవ్వాల్సిందే అని మాట్లాడాను,అన్నిటికీ చూద్దాం,చేద్దాం అనే సమాధానం చెప్పారు. చివరిగా సీట్ మార్చడం కుదరదు మీకు రాజ్యసభ ఇస్తాం,పబ్లిక్ మీటింగులో ప్రకటిస్తాం అన్నారు.

మేము మాత్రం మా కుటుంబం ఎప్పుడూ పరోక్ష ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించలేదు మేము జనంతో వుండాలి జనమే మా బలం లోక్ సభ ఇవాల్సిందే అని అడిగాము.చర్చలు అక్కడ వాయిదా పడ్డాయి.
మరి రెండు రోజుల్లో పూర్తి అవగాహన రావచ్చు,అప్పటివరకు అంతా మంచే జరుగుతుంది అని ఆశిద్దాం,,,,మీ విలువైన సలహాలను సూచనలను తెలియజేయండి.
మీ మాగంటి బాబు.
మాజీ మంత్రి వర్యులు మరియు ఏలూరు పార్లమెంట్ మాజీ సభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: