కాంగ్రెస్ : అక్కడ మంత్రి తమ్ముడికే.. రేవంత్ టికెట్ ఇవ్వబోతున్నాడా?

praveen
అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే అటు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం  అనుమతితో గెలుపు గుర్రాలను బలులోకి దింపుతున్నారు. ఒకవైపు అటు బిఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకొని మరి టికెట్లు ఇస్తూ ఉండడం గమనార్హం. ఇటీవలే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య అటు వరంగల్ ఎంపీ టికెట్ దక్కించుకుంది.

 ముందుగా బిఆర్ఎస్ నుంచి ఇలా ఎంపీ టికెట్ దక్కినప్పటికీ ఏకంగా ఆ పార్టీలో టికెట్ వదులుకొని మరి కాంగ్రెస్ కండువా కప్పుకుంది కడియం కావ్య. ఇక ఆ తర్వాత  కాంగ్రెస్ పార్టీలో అదే వరంగల్ స్థానం నుంచి టికెట్ను దక్కించుకుంది. అయితే ఇప్పటివరకు కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ స్థానాల విషయంలో మాత్రం  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరికి ఛాన్స్ ఇస్తుంది అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. అయితే ఖమ్మం నుండి అటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని తెలుస్తోంది.

 అదే సమయంలో కరీంనగర్ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించాలని అనుకుంటున్నారట.  ఇప్పటికే అటు బీసీ, రెడ్డి, వెలమ సామాజిక వర్గాల నేతల పేర్లను అటు కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సీఈసీ బేటిలో ఇక ఇలా బీసీ, రెడ్డి, వెలమ సామాజిక వర్గాల నేతల పేర్లు తీసుకురాగా ఇక పార్టీ నేతలు వారి పేర్లను తిరస్కరించారట. దీంతో కరీంనగర్ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని ఎంపిక చేసి గెలిపించుకునే బాధ్యత మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించినట్లు సమాచారం. ఇలా కరీంనగర్ నుంచి బీసీ అభ్యర్థి ఖరారు అయితే ఖమ్మం నుంచి రెడ్డి సమాజ్క వర్గానికి సంబంధించిన నేతను ఎంపిక చేస్తారట. కాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇక అక్కడ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: