విజేత‌: ఆ టీడీపీ ఎమ్మెల్యేకు హ్యాట్రిక్ గెలుపు... మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వక త‌ప్ప‌దు..!

RAMAKRISHNA S.S.
ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లోనే వైసీపీ విధ్వంస‌క ప్ర‌భంజ‌నాన్ని త‌ట్టుకుని గెలిచిన వారిలో 23 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నారు. వీరిలో కూడా న‌లుగురు ఆ త‌ర్వాత పార్టిని వీడితో ఇప్పుడు పార్టీకి కేవ‌లం 19 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే మిగిలారు. వీరిలోనూ కొంద‌రిపై వైసీపీ ప్ర‌భుత్వం త‌మ పార్టీలోకి రావాల‌ని ఎంత ఒత్తిడి చేసినా రాకుండా టీడీపీ కోసం అలాగే పోరాటాలు చేసి నిల‌బ‌డిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ గౌడ్ ఒక‌రు.
అన‌గానికి రేప‌ల్లెతో రెండు ద‌శాబ్దాల అనుబంధం ఉంది. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌తో పార్టీల‌తో సంబంధం లేకుండా ఆయ‌న మ‌మేక‌మై ప‌ని చేస్తున్నారు. 2009లో మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ చేతిలో స్వ‌ల్ప తేడాతో ఓడిన ఆయ‌న ఆ త‌ర్వాత 2014, 2019 ఎన్నిక‌ల్లో రెండుసార్లు వ‌రుస‌గా అన‌గానిని చిత్తు చేశారు. ఇప్ప‌టికే రెండు సార్లు గెలిచిన అన‌గానిపై ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి. బీసీ నేత‌గాను.. త‌న కులంలో రాష్ట్ర వ్యాప్తంగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ సారి టీడీపీ నుంచి వ‌రుస‌గా నాలుగోసారి ఆయ‌న పోటీలో ఉన్నారు. అటు వైసీపీ నుంచి ఇక్క‌డ 25 ఏళ్ల పాటు రాజ‌కీయాలు చేసిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యులు అయిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఫ్యామిలీని ప‌క్క‌న పెట్టేసిన జ‌గ‌న్ మాజీ ఎమ్మెల్యే ఈపూరు సీతారావ‌మ్మ త‌న‌యుడు ఈపూరు గ‌ణేష్‌కు సీటు ఇచ్చారు. మోపిదేవి త‌న వార‌సుడిని రంగంలోకి దింపాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసినా జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు ఆయ‌న గ‌ణేష్‌కు మ‌న‌స్ఫూర్తిగా స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేద‌నే అంటున్నారు.
రేప‌ల్లె రాజ‌కీయ చ‌రిత్ర‌లో మోపిదేవికి ఎన్నిసార్లు టిక్కెట్ ఇచ్చినా అన‌గానిని ఓడించే సీన్ లేద‌ని జ‌గ‌న్‌కు అర్థ‌మ‌య్యాకే ఆయ‌న కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టేశార‌న్న చ‌ర్చ కూడా స్థానికంగా ఉంది. కానీ.. మోపిదేవి వ‌ర్గంలో గ‌ణేష్‌పై వ్య‌తిర‌క‌త కొన‌సాగుతోంది. వైసీపీలో గ్రూపుల గోల‌.. చాప‌కింద నీరులా అస‌మ్మ‌తి ఉంటే.. టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న అనగానికి అలాంటి త‌ల‌నొప్పులు ఏం లేవు. ప్ర‌స్తుతం రేప‌ల్లె జ‌నాల నాడి ప్ర‌కారం అన‌గాని హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయంగా ఉంది. అలాగే ప్ర‌భుత్వం వ‌స్తే బీసీ - గౌడ కోటాలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ప‌క్కా అన్న ప్ర‌చారం కూడా ఆయ‌న‌కు మ‌రింత ప్ల‌స్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: