విజేత‌: ' గొట్టిపాటి ' పై జ‌గ‌న్ కుప్పిగంతులు... ర‌వికి వ‌రుస‌గా ఐదో విజ‌యం..!

RAMAKRISHNA S.S.
ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ కుప్పిగంతులు వేస్తూనే ఉంది. ఇక్క‌డ  నుం చి వ‌రుస విజ‌యాలు అందుకున్న గొట్టిపాటి ర‌వికుమార్‌ను ఓడించాల‌నేది వైసీపీ ప్ర‌య‌త్నం.  పైగా.. ఆయ‌న‌ను ఓడించ‌డం ద్వారా.. ఒక పెద్ద క‌సితీర్చుకోవాల‌న్నది వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ ల‌క్ష్యంగా ఉంది. ఎందుకంటే.. 2014లో వైసీపీ టికెట్ పై గెలిచిన ర‌వి.. ఆ పార్టీని వ‌దిలి పెట్టారు. దీనిని వైసీపీ జీర్ణిం చుకోలేక పోతోంది.
ఈ క్ర‌మంలోనే ఎలాగైనా ర‌విని ఓడించాల‌నేది జ‌గ‌న్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌యోగాల‌పై ప్ర‌యోగాల‌తో అద్దంకిలో జ‌గ‌న్‌ ప‌రువు పోగొట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. వాస్త‌వానికి ఇప్ప‌టికి ర‌వి మూడు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. 2009లో కాంగ్రెస్ టికెట్‌పై త‌ర్వాత 2014లో వైసీపీ టికెట్‌పైనా ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, 2019లో టీడీపీ టికెట్‌పై నా గెలుపు గుర్రం ఎక్కారు. గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ ర‌విని ఓడించేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ చెంచు గ‌ర‌ట‌య్యకు సీటు ఇచ్చింది.
కానీ, గ‌ర‌ట‌య్య రాజ‌కీయాలు సక్సెస్ కాలేదు. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో ర‌విని ఓడించ‌లేక పోయారు. ఐదేళ్ల పాటు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న గ‌ర‌ట‌య్య కుమారుడు చైత‌న్య ఇద్ద‌రూ క‌లిసి టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు పాణెం చిన్న హ‌నిమి రెడ్డి అనే నేత‌కు వైసీపీ టికెట్ ఇచ్చింది. అయితే.. ఈయ‌న ప్ర‌భావం సంగ‌తి ప‌క్క‌న పెడితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న గ‌ర‌ట‌య్య ఫ్యామిలీ టీడీపీ బాట ప‌ట్ట‌డంతో ర‌వికి మ‌రింత ద‌న్నుగా మారింది. దాదాపు క‌మ్మ వ‌ర్గం అంతా కూడా.. ర‌వికి జై కొడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.
అంతేకాదు.. గ‌ర‌ట‌య్య వ‌ర్గంగా ఉన్న బీసీలు,రెడ్లు కూడా.. టీడీపీకి జై కొడుతున్నారు. సంత‌మాగ‌లూరు మండ‌లంలో ఉన్న వైసీపీ టాప్ లీడ‌ర్‌, మాజీ మంత్రి బాలినేని వ‌ర్గం రెడ్డి నేత‌లు కూడా టీడీపీలోకి వ‌చ్చేశారు. ఇది అద్దంకి రాజకీయ స‌మీక‌ర‌ణ‌ల‌ను రాత్రికి రాత్రి మార్చేసింది. ఫ‌లితంగా గొట్టిపాటి గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. దీనికితోడు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు కూడా ఎక్కువ‌గా ఉన్న అద్దంకిలో.. వారంతా కూడా ర‌వికి ప్ల‌స్ అవుతున్నారు. ఎలా చూసుకున్నా అద్దంకిలో జ‌గ‌న్  చేసిన ప్ర‌యోగం మ‌రోసారి విఫ‌లం కావ‌డం త‌థ్య‌మ‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: