సొంత ఇళ్లులేని వైసీపీ శిష్యుడు.. కోటీశ్వ‌రుడైన టీడీపీ గురువును ఓడిస్తాడా..!

RAMAKRISHNA S.S.
కోట్లకు పడగలెత్తి 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టుకునే గురువుగారు టిడిపి.. వైపు ఇటు తనకు సొంత ఇల్లు కూడా లేదు నేను పేదవాడిని అని చెప్పే నేత వైసిపి వైపు.. పైగా ఇద్దరు గురు శిష్యులు. ఈ ఇద్దరు మధ్య ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలోని మైలవరం నియోజకవర్గం వేదికగా ఆసక్తికర పోరు సాగ‌నుంది. టిడిపి నుంచి తాజా వైసిపి మాజీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. వైసీపీ నుంచి మైలవరం జడ్పిటిసి గా ఉన్న స‌ర్నాల తిరుపతి రావు యాదవ్ పోటీ చేస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ కు తిరుపతిరావు శిష్యుడు కావటం విశేషం. మైలవరం పంచాయతీ ఎన్నికలలో వార్డు మెంబర్ గా పోటీ చేసి ఓడిపోయిన తిరుపతిరావుకు మైలవరం జడ్పిటిసి టికెట్ ఇచ్చి గెలిపించడంలో కృష్ణ ప్రసాద్ కీలక పాత్ర పోషించారు.
ఇప్పటికీ వైసీపీ అభ్యర్థి తిరుపతిరావు తన గురువు వసంత కృష్ణ ప్రసాద్ అని చెప్పుకుంటారు. 2019 ఎన్నికలలో టిడిపి నుంచి పోటీ చేసిన అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వయసు నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వసంతకు వైసీపీలో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇదే నియోజకవర్గానికి చెందిన మంత్రి జోగి రమేష్ మైలవరంలో పెత్తనం చేయడంతో రెండేళ్లుగా అస‌హ‌నంతో ఉన్న వ‌సంత వైసీపీని వీడి టిడిపిలో చేరి అనూహ్యంగా టిడిపి టికెట్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా రాజకీయాలలో రెండున్నర దశాబ్దాలుగా చక్రం తిప్పిన టిడిపి కీలక నేత.. మాజీ మంత్రి దేవినేని ఉమాకు వసంత ఎంట్రీ తో టిక్కెట్ లేకుండా పోయింది.
ఇక వైసిపి నుంచి ఎవరు పోటీ చేస్తారు ? అన్న సస్పెన్స్ కు తెరదించుతూ మైలవరం జడ్పిటిసి తిరుపతిరావు యాదవ్ కు జగన్ టిక్కెట్ కేటాయించారు. వాస్తవంగా చెప్పాలి అంటే తిరుపతిరావు కంటే ఇదే నియోజకవర్గానికి చెందిన మంత్రి జోగి రమేష్ కు మైలవరం సీటు ఇచ్చి ఉంటే పోరు ఆసక్తిగా ఉండేది. వసంత కృష్ణ ప్రసాద్ సామాజిక, రాజకీయ, ఆర్థిక అంగబలాలలో బలంగా ఉన్నారు. పైగా వసంతకు ఉన్నది ఉన్నట్టు ముక్క సూటిగా మాట్లాడుతారు అన్న పేరు ఉంది. అవినీతి, కాంట్రవర్సీ అన్న విమర్శలు కూడా లేవు.. చెప్పుకోదగ్గ మైనస్లు కూడా లేవు. అలాంటి వసంతపై వైసీపీ నుంచి జగన్ సాధారణ కార్యకర్త మైలవరం జడ్పిటిసి అయినా తిరుపతిరావు పోటీలో దింపారు.
వాస్తవానికి తనకు జగన్ సీటు ఇచ్చినప్పుడు తాను అన్ని కోట్లు ఖర్చు పెట్టుకోలేనని తిరుపతిరావు చెప్పడంతో జగన్ రెండు జతల బట్టలు తెచ్చుకో ఖ‌ర్చంతా నేను పెట్టుకుంటాను.. అయినా నా మీద నమ్మకం లేకపోతే నువ్వు పులివెందుల వెళ్లి పోటీ చేస్తే.. మైలవరంలో నేను పోటీ చేస్తాను అని చెప్పి తిరుపతిరావుకు ధైర్యం నూరు పోశారు. సామాజిక సమీకరణలపరంగా జగన్ బీసీలకు ఇచ్చానని చెప్పుకుంటున్న మైలవరంలో బీసీలకు ఇవ్వాల్సి వస్తే తిరుపతిరావు కంటే జోగి రమేష్ కరెక్ట్ అన్న చర్చ‌ కూడా వైసిపి వర్గాల్లో ఉంది. ఇక తిరుపతిరావు తనకు సొంత ఇల్లు కూడా లేదు అని ప్రచారంలోకి వెళుతుండటం కూడా కొందరికి కనెక్ట్ అయ్యేలా ఉంది. అటు వసంత కృష్ణ ప్రసాద్ పై కూడా పెద్దగా వ్యతిరేకత లేదు. అయితే ఇక్కడ బలంగా ఉన్న దేవినేని ఉమా వర్గం వసంతకు ఎలా సపోర్ట్ చేస్తుంది ?అన్నది కూడా ఆసక్తిగానే ఉంది. ఏది ఏమైనా మైలవరంలో ప్రస్తుతానికి ఎవరు గెలుస్తారు ? అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సమీకరణలు ఈ నెల రోజుల్లో ఎలాగైనా మారే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: