చంద్ర‌బాబు - ప‌వ‌నూ మోదీ క‌లిసొచ్చినా అక్క‌డ మాత్రం జ‌గ‌నే హీరో అయ్యాడే..!

RAMAKRISHNA S.S.
ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని కూడా కలుపుకుని ఈ మూడు పార్టీలు కూటమికట్టి మరీ పోటీ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో జనసేన అభిమానులు టిడిపి బలంగా ఉండడం.. నార్త్ ఇండియా జ‌నాలు ఎక్కువగా ఉన్న అతిపెద్ద నగరం విశాఖపట్నం ఏరియాలో కూటమి వైసీపీని చిత్తుచిత్తు చేసేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో అటు మూడు పార్టీలు కూటమి కట్టినా కూడా ఇక్కడ వైసిపి అధినేత జగనే రియల్ హీరోలా కనిపిస్తున్నాడు.
గత ఎన్నికలలోనే విశాఖ నగరంలోని నాలుగు సీట్లలో టిడిపి ఘనవిజయం సాధించింది. అంతటి యాంటీ వేవ్‌లోనూ నగరంలో టిడిపి తన పట్టు నిలుపుకుంది. కానీ ఇప్పుడు ఈ నాలుగు సీట్లలో టిడిపి కచ్చితంగా గెలిచే సీటు ఏది ? అంటే నూటికి నూరు శాతం చెప్పలేని పరిస్థితి. ఏజెన్సీలోని అరకు - పాడేరు సీట్లలో వైసిపి గెలుపును ఎవరు ? ఆపే పరిస్థితి లేదు. మాడుగుల లోనూ వైసీపీకే ఆధిక్యం కనిపిస్తోంది. చోడవరం - పాయకరావుపేటలో టాప్ ఫైట్ నెలకొంది. ఎలమంచిలి - పెందుర్తి - అనకాపల్లిలో మాత్రం జనసేన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
గాజువాక - భీమిలిలో టిడిపి ఆదిక్య‌త కనిపిస్తుంది. నగరంలోని నాలుగు సీట్లలో కూటమి వైసీపీ అభ్యర్థుల మధ్య నరాలు తెగే పోటీ తప్పేలా లేదు. ఓవరాల్ గా చూస్తే వైసిపి ఇక్కడ కూటమికి గట్టి పోటీ ఇస్తూ మూడు పార్టీలకు బ్రేకులు ఇస్తూ ఐదు నుంచి ఏడు నియోజకవర్గాలలో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు మూడు పార్టీలు జోడి కట్టినా కూడా విశాఖపట్నం లాంటి కీలక జిల్లాలో వైసిపి ఈ మాత్రం సీట్లు గెలుస్తుంది అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి.
ఇక జిల్లాలో ఉన్న మూడు పార్లమెంటు సీట్లలో అరకు పార్లమెంటు సీటుపై వైసీపీ జెండా ఎగరటం కాయంగా కనిపిస్తోంది. విశాఖ పార్లమెంటు సీటులో తెలుగుదేశంకు కాస్త ఆధిక్యం కనిపిస్తున్నా.. అనకాపల్లిలోనూ గట్టి పోటీ మధ్యలో వైసిపి ఎంపీ కాండేట్ బుడి ముత్యాల నాయుడు, కూటమి ఎంపీ కాండిడేట్ సీఎం రమేష్ పై గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా అటు కూటమి కట్టి మూడు పార్టీల నేతలు జగన్ పై దండెత్తుతున్నా జగన్ వాళ్ళని ఎదుర్కొని ఈ స్థాయిలో సీట్లు గెలవటం అంటే నిజంగా గొప్ప అని చెప్పాలి.g

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: