ఏపీ : రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొడుతున్న ఆ రెండు పత్రికలు.. జమ కాకుండా ఆపగలరా?
ఏపీలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందనే సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలుకు ముందే పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా జగన్ పలు పథకాల అమలు దిశగా అడుగులు వేశారు. వైఎస్సార్ చేయూతతో పాటు మరికొన్ని పథకాల బటన్లు నొక్కి దశల వారీగా నగదు పేద ప్రజల ఖాతాలో జమవుతుందని ఏ మాత్రం కంగారు పడవద్దని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన 2019 నుంచి అమలు చేస్తున్నారు.
అయితే జగన్ బటన్ నొక్కిన పథకాలు అమలైతే ఆ పార్టీకి ప్లస్ అవుతుందని భావించిన రెండు పత్రికలు ఏపీ పేదల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పథకాలు కొత్త పథకాలు కాకపోయినా ఈ పథకాల నగదు జమ కాకుండా కథనాలను ప్రచారం చేస్తూ ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈసీ నుంచి ఈ పథకాలకు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ మాత్రం లేదు.
పేదవాళ్లకు మంచి చేసినా మంచి పథకాలను అమలు చేసినా ఓర్వలేనితనం ఆ రెండు పత్రిలకు ఎందుకని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు రైతు రుణమాఫీ నాలుగో విడత, ఐదో విడత డబ్బులను రిలీజ్ చేసినట్టు అధికారికంగా ప్రకటించినా ఒక్క రైతు ఖాతాలో కూడా ఆ నగదు జమ కాలేదు. ఆ రెండు పత్రికలు ప్రజలకు మంచి చేయకపోయినా పరవాలేదని చెడు చేసే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.