రాయలసీమ: చంద్రబాబు తప్పు.. అభ్యర్థులకు ముప్పు..!

Divya
కూటమిలో భాగంగా టిడిపిలో రోజురోజుకి అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే చాలామంది నేతల తమకు టికెట్టు దక్కకపోవడంతో టిడిపి అభ్యర్థిగా నిలబడుతున్న వారికి సపోర్ట్ చేయమంటూ కూడా తెలియజేస్తున్నారు.. ఇప్పుడు తాజాగా ఇండియా హెరాల్డ్  అందిస్తోన్న సమాచారం మేరకు గుంతకల్లు నియోజవర్గంలో గుమ్మనూరు జయరాంకు అడుగడుగున అసమ్మతి ఎదురవుతోంది. తెలుగు తమ్ముళ్లే స్వయంగా చుక్కలు చూపిస్తున్నారు.. సపోర్ట్ చేసేదే లేదంటూ సొంత పార్టీ నేతలే ఆయనను హెచ్చరిస్తున్నారు.

ఇలా ఎన్నో చర్చలు,  ఎన్నో సమావేశాలు అనంతరం గుంతకల్లు నియోజకవర్గం లో టిడిపి టికెట్ గుమ్మనూరు జయరామ్ ను వరించింది.. సీనియార్టీ , పార్టీ విధేయతను కూడా పక్కనపెట్టి జయరాంకు సీటు ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్లు ఈ విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ తో పాటు కుటుంబ సభ్యులు, వర్గీయులు చాలా అసంతృప్తి తెలియజేస్తున్నారు.. దీంతో ఒకసారిగా జయరాయ్  ను ఓడిస్తామంటూ బహిరంగ ప్రకటనలతోనే తెలియజేస్తున్నారు. మరి చంద్రబాబు పైన గౌరవంతో ఆయన నిర్ణయానికి తలవంచి జితేంద్ర గౌడ్ సర్దుకుపోతారా లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనేది ఇప్పుడు అక్కడ ఆసక్తికరంగా మారింది..
మరొకవైపు గుమ్మనూరు జయరాం శిబిరంలో ఉన్న కొంతమంది తెలుగుదేశం నాయకులు,  ఆయన కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా స్థానికంగా ఉన్న ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు.. రకరకాల తాయిలాలతో కేడర్ ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. గుమ్మనూరు అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా రోడ్డు పైకి వచ్చి నిరసన తెలిపిన తాము.. ఆయన కోసం ఎలా పనిచేస్తామని చాలా మంది చాలా చోట్ల తెగేసి చెబుతున్నారు.. ఇక గుమ్మనూరు జయరాం అభ్యర్థిత్వం పట్ల స్థానిక ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.. రౌడీయిజం మాఫియాకి మారుపేరుగా చెప్పుకునే ఈ గుమ్మనూరు జయరాం,  ఆయన అనుచరులు ప్రశాంతమైన గుంతకల్లు నియోజకవర్గం లో అలజడలు సృష్టిస్తారనే భయాందోళనకు గురవుతున్నారు.
ముఖ్యంగా గుమ్మనూరు జయరాం చరిత్ర తెలిసిన వారైతే ఏకంగా హడలిపోతున్నారు కూడా.. పేకాట, భూ కబ్జాలు, ఆయన అనుచరుల ఆగడాలను తలుచుకుంటూ భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు తమ్ముళ్లతో పాటు ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కురవ,యాదవ తదితర అనేక సామాజిక వర్గ నాయకులతోపాటు పట్టణ వ్యాపారులు.. ఏకంగా విలేకరుల సమావేశాలు పెట్టి జయరాం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ.. రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా చేస్తున్నారు.. ఇకపోతే గుంతకల్లు నియోజకవర్గం లో అడుగుపెట్టక ముందే సొంత కార్యకర్తలు,  ప్రజలలో ఈయనపై పూర్తి వ్యతిరేకత ఏర్పడుతోంది.. ఒకవేళ అడుగుపెట్టినా సొంత నాయకులే సపోర్టు చేయడం లేదు.. ఇక చంద్రబాబు టికెట్ కేటాయించడంపై ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. రూ .కోట్లు చేతులు మారడంతోనే బాబు ఆయన వైపు మొగ్గు చూపారనే విమర్శ కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.. మొత్తానికైతే గుమ్మనూరు జయరాంకు గుంతకల్లులో ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. ఏదేమైనా చంద్రబాబు చేస్తున్న తప్పులే అభ్యర్థులకు ముప్పుగా మారుతుందని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: