తిరుపతి: నల్లారి సోదరుల మధ్య వైరం.. టీడీపీ కి దెబ్బేనా..?

Divya
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన సొంత నియోజకవర్గ వాల్మీకిపురంలో బాగా ప్రజాదరణ కలిగి ఉన్న నాయకుడిగా పేరు పొందారు. ఆయన నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధిని కూడా చేశారు.. ప్రజలు కూడా ఆయనపై నమ్మకం, కృతజ్ఞతలు చూపిస్తూ ఉంటారు.అయితే కొన్ని కారణాల చేత kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి మధ్య వైరం ఏర్పడింది. ఇండియా హెరాల్డ్ కు తెలిసిన సమాచారం మేరకు.. ముఖ్యంగా తన తమ్ముడు మోసం చేయడం వల్లే కిరణ్ కుమార్ తన సొంత ఊరికి కూడా రావడమే మానుకున్నారట..

ఈ సమయంలో ఈ నల్లారి సోదరులు ఇద్దరూ ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేయబోతున్నారు.. ముఖ్యంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న మంచి పేరు ఆయనకు బాగా ఉపయోగపడుతుంది.. కానీ తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా వాల్మీకిపురం బరిలో ఆయన తమ్ముడు కిషోర్ రెడ్డి కూడా నెగ్గడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే కిషోర్ కుమార్ రెడ్డి గెలవాలి అంటే కిరణ్ కుమార్ రెడ్డి మద్దతు కచ్చితంగా ఉండాలి. మరి వీరి మధ్య వైరం ఎన్నికల మీద ఎలా ఎఫెక్ట్ పడుతుందో అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి.

కిరణ్ కుమార్ రెడ్డికి కూడా టిడిపి నేత చంద్రబాబు నాయుడుతో కొన్నేళ్లుగా వైరం ఉన్నది. కిరణ్ తండ్రి అమర్నాథ్ రెడ్డి పైన కూడా చంద్రబాబుకు వ్యతిరేకం ఉండేదట. అలా ఇప్పటికీ ఆ వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర విభజన అనంతరం వామలపాడు నియోజకవర్గంలో గతిలేక చంద్రబాబు,  కిరణ్ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని చేర తీశారు. శత్రువులుగా ఉన్నటువంటి అన్నదమ్ములు ఇద్దరు కలిసి ప్రచారం చేయవలసిన పరిస్థితి ఏర్పడినది.. కిరణ్ కుమార్ రెడ్డికి వామలపాడు నియోజకవర్గంలోని ప్రజలలో మంచి పేరు ఉన్నప్పటికీ.. ఆయన చెప్పినా సరే తన తమ్ముడికి ఓటు వేసే పరిస్థితి కనిపించడం లేదట..

ఇండియా హెరాల్డ్ కు వచ్చిన సోర్స్ మేరకు.. మదనపల్లి ఇతర ప్రాంతాలలో బలంగా ఉన్నటువంటి ముస్లిం ఓట్లు సైతం అక్కడ పడవని తెలుస్తోంది.. అలాగే బిజెపి ఎం పీ అభ్యర్థిగా ఉన్న కిరణ్ కు బ్రహ్మరథం పడతారని..ఆ సమయంలో ఎమ్మెల్యేగా తమ్ముడు కిషోర్ ను ప్రజలు ఓడిస్తారనే అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: