గోదావ‌రి: ఆ జిల్లాలో టీడీపీ బంప‌ర్ మెజార్టీతో గెలిచే ఫ‌స్ట్ సీటు ఇది..!

RAMAKRISHNA S.S.
ఏపీలో టిడిపి - జనసేన - బిజెపి పొత్తు మిగిలిన ప్రాంతాలలో ఎలా ఉన్నా ఉభ‌య గోదావరి జిల్లాలు.. ఉత్తరాంధ్రలో మాత్రం చాలా గట్టిగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాలలో ఈ కూటమి ప్రభావం వైసిపి మాజీ మంత్రులు, మంత్రులు.. సీనియర్ నేతలకు కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అలాంటి నియోజకవర్గాలలో ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరు కూడా ఉంది. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని మరోసారి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికలలో ఆయన 21 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికలలో వైసీపీకి అంత ఉన్నా కూడా కేవలం 3000 పైచిలుకు ఓట్ల తేడాతో మాత్రమే గట్టెక్కారు.
ఇక గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆకస్మిక మరణం తర్వాత ఆయన సోదరుడు బడేటి చంటి రాజకీయాల్లోకి వచ్చారు. తాజా ఎన్నికలలో చంటికి సీటు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో కూటమి ప్రభావంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత గట్టిగా కనిపిస్తోంది. అర్బన్ ఓటర్లు.. ఉద్యోగులు.. ధనికవర్గాలు.. వ్యాపార వర్గాలతో పాటు కమ్మ, కాపు బీసీ, బ్రాహ్మ‌ణ‌ సామాజిక వర్గాలు అన్ని ఇక్కడ వైసిపి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి.
ఇక ఆళ్ల నాని వైసీపీ ప్రభుత్వంలో తొలి టర్మ్‌లో జగన్ ప్రభుత్వంలో కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేయడంతో పాటు డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. పేరుకు ఆయన మూడేళ్లు మంత్రిగా ఉన్న ఏలూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు జీరో. నాని వ‌ల్ల‌ నియోజకవర్గానికి ఒరిగింది ఏమీ లేదు. అసలు ఆయన ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకోవడంలో దూరం జరిగారు. పార్టీ కేడర్ ను కూడా సరిగా పట్టించుకోలేదు. అసలు ఈసారి నానికి సీటు ఇవ్వ‌ర‌ని ఎన్నికల్లో పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోతారన్న చర్చ జరిగింది. అయినా జగన్ ఎందుకో ఆయనకు సీటు ఇచ్చారు.
ఇక టిడిపి నుంచి పోటీ చేస్తున్న బడేటి చంటి విషయానికి వస్తే తన అన్న హఠాన్మరణం తర్వాత నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికల్లోను ఆయనకే చంద్రబాబు సీటు ఇచ్చారు. అందరినీ కలుపుకు పోయే మనస్తత్వంతో పాటు కాంట్రవర్సీకి వెళ్లారన్న పేరు ఉంది. నియోజకవర్గంలో జనసేన కూడా బలంగా ఉంది. జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు కూడా తనకు సీటు రాలేదన్న అసంతృప్తి ఉన్నా సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి. ఏది ఏమైనా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో కూటమి తరపున తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచే సీట్లలో ఏలూరు ఒకటని వైసిపి వాళ్ళు సైతం ఒప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: