ఏపీ:కూటమే జగన్ ను మళ్లీ సీఎంగా నిలబెట్టేలా వుందే..?

Divya
ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో గెలుపును టచ్ చేయాలని టీడీపీ ప్రభుత్వం కూటమితో సహా ఎన్నికల బరిలో దిగబోతోంది.. కానీ ఇక్కడే కూటమిలో అసలైనది మిస్ అవుతోందంటూ పలువురు రాజకీయ నాయకులు చర్చిస్తున్నారు.. ఇండియా హెరాల్డ్ కు తెలిసిన సమాచారం మేరకు.. అన్ని రాజకీయ పార్టీల మధ్య ఖచ్చితంగా సయోద్య అనేది ఉండాలి ..కానీ ఏపీలో చూస్తూ ఉంటే అలాంటిది ఎక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా కూటమిలో కీలకమైన అంశమేదో మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అదే ఒక లోటుగా మారుతోందని చెప్పవచ్చు.

ఇండియా హెరాల్డ్ అందిస్తోన్న సమాచారం మేరకు.. కూటమిలో కచ్చితంగా సర్దుబాటు ఉండాలని.. పరస్పరం నమ్మకంతోనే ఉంటూ ఉమ్మడిగా  ముందుకు వెళ్లాలి.. కానీ టిడిపి కూటమిలో చూస్తే అన్ని పార్టీలు కలిసి సీట్లు పంచుకున్నారు  అన్నట్లుగా కనిపిస్తోంది.  ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ఈ కూటమి అని చెబుతున్నప్పటికీ ఇక్కడ ఎక్కడ కూడా ఉమ్మడి కార్యాచరణ ముందుకు సాగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.. జనసేనతో కూటమి అంటూ మళ్లీ బిజెపిను కూటమిలో కలపడం ఇప్పుడు టిడిపిలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.జనసేనతో కూటమి అంటూ మళ్లీ బిజెపినీ కూటమిలో కలపడం ఎప్పుడు అయితే జరిగిందో అప్పటినుంచి టిడిపిలో ప్రకంపనలు మొదలయ్యాయి..

ఇక కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో మేనిఫెస్టోని చెప్పకపోయినా కొన్ని కీలకమైన హామీలను ప్రజలకు ఇచ్చారు.. అలాగే టిడిపి కూడా మహానాడులో మినీ మేనిఫెస్టో అంటూ ఆరు సూపర్ సిక్స్ హామీలు అంటూ ఉచిత పథకాలను ప్రకటించింది. ప్రస్తుతం బిజెపి చూస్తే ఉచిత పథకాలకు వ్యతిరేకంగానే కనిపిస్తోంది. ఈ విషయం పైన కూడా ఎక్కడ స్పష్టత లేదు. ప్రజా సంక్షేమం కోసం బిజెపితో పొత్తు అంటున్న టిడిపి ప్రజలకు అవసరమైన పోలవరం ప్రాజెక్టు గురించి ఎలాంటి హోదా కాని హామీ కానీ చెప్పలేదు.. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు.. రైల్వే జోన్ ఇతరత్రా అంశాల పైన కూడా టిడిపి, బిజెపి ఎక్కడ స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు.

ఇండియా హెరాల్డ్ కు అందిస్తోన్న ప్రత్యేక కథనం మేరకు కేవలం వైసీపీ జగన్ ని ఓడించడానికి టార్గెట్ చేస్తున్నారని.. బిజెపి మాత్రం ఆ విషయంలో కాస్త లైట్గా ఉన్నట్లు తెలుస్తోంది.. ఏపీలో కూటమి ఫలానా మేలు చేస్తుందని చెప్పే బదులు కేవలం జగన్ మీద విమర్శలు చేయడం కోసమే కూటమి ఏర్పాటు చేశారని వాదన తెరపైకి వచ్చింది.. అంతేకాదు అటు టిడిపి నాయకుడు చంద్రబాబు,ఇటు  జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా జగనన్న విమర్శించడానికి పొత్తు కలుపుకున్నారని తెలుస్తోంది..  ముఖ్యంగా టిడిపి 144 సీట్లు.. జనసేన 21 సీట్లు,  బిజెపి 10 సీట్ల పొత్తులో భాగంగా కుదుర్చుకున్నప్పటికీ ఈ సీట్ల సర్దుబాటు విషయంలో కూడా సరిగ్గా సఖ్యత లేదని తెలుస్తొంది . ముఖ్యంగా మూడు పార్టీలలో అసంతృప్తి చాలా తీవ్రస్థాయిలో ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జనసేన,  టిడిపి పొత్తు ఉన్నప్పుడు కాస్త బాగానే ఉన్న చివరికి బిజెపి చేరడం వల్ల గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం మరో 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది.. ఒకవేళ ప్రచారంలో భాగంగా ఎవరి దారి వారు చూసుకుంటే ఈ కూటమి కచ్చితంగా బెడిసి కొడుతుందని పలువురు విశ్లేషకులు తెలుపుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ కూటమే మళ్లీ జగన్ను సీఎం చేసేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: