విశాఖ: ఊపందుకుంటున్న అనకాపల్లి ఆత్మగౌరవ నినాదం?

Purushottham Vinay
విశాఖ: కడప నుంచి  డైరెక్ట్ గా అనకాపల్లిలో ఫిక్స్ అయిన బీజేపీ  ఎంపీ అభ్యర్ధి పై అనకాపల్లిలో మేధావులు గళం విప్పుతున్నారు. అనకాపల్లి భౌగోళిక సామాజిక పరిస్థితులపై అవగాహన లేని వారికి టికెట్లు ఇచ్చి జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని బాగా మండిపడుతున్నారు.అసలు ఎంపీ అభ్యర్థి  రమేష్ కి కనీసం అనకాపల్లి జిల్లా సరిహద్దులు కూడా తెలియవని అనకాపల్లి ఆత్మగౌరవ వేదిక కన్వీనర్ గుడాల సత్యనారాయణ ముదిరాజ్ మండిపడ్డారు. తనకు టికెట్ అనకాపల్లిలో ఇచ్చారని సీఎం రమేష్ గుర్తించి కనీసం తానుగా అనకాపల్లికి వచ్చి జిల్లా స్థానిక పరిస్థితుల పైన అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యతని మరచిపోవడం నిజంగా బాధాకరం అన్నారు.దానికి వ్యతిరేకంగా స్థానిక టీడీపీ బీజేపీ నేతలు పనిగట్టుకుని మరీ సీఎం రమేష్ కోసం అనకాపల్లి పొలిమేరలలో గంటల తరబడి ఎదురు చూస్తుండటం అనకాపల్లి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే అని ఆయన ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా ప్రజలకు ఆత్మగౌరవం లేవని వీరంతా భావిస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.నాన్ లోకల్ కి ఘన స్వాగతాలు పలకడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని మేధావులు మండిపడుతున్నారు.



రమేష్ ని మించిన ఎంపీ అభ్యర్థి అనకాపల్లిలో  లేరని జనాలకు చెప్పదలిచారా అని వారు నిలదీస్తున్నారు. మేమంతా నీకు బానిసలమని మొక్కే ఈ విధానాన్ని ఎలా అలవాటు చేసుకుంటున్నారని కోపం వ్యక్తం చేస్తున్నారు.అనకాపల్లి ప్రజలకు నిండుగా ఆత్మాభిమానం ఉందని వారి రాజకీయ చైతన్యాన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే బోల్తా కొట్టినట్లే అని కూడా అక్కడి మేధావులు హెచ్చరిస్తున్నారు. కేవలం అంగబలం అర్ధబలం ఉందని సీఎం రమేష్ చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న నాయకులు ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సి ఉందని అంటున్నారు. ఓటేసేది నాయకులు కారని ప్రజలని గుర్తుంచుకోవాలని అంటున్నారు.ఈ అనకాపల్లి ఆత్మగౌరవ నినాదం స్థానిక నినాదం క్రమంగా ఊపందుకుంటోంది. ఇది కనుక ఎన్నికల టైంకి కీలకంగా మారితే కూటమికి భారీ ముప్పు తప్పదని అంటున్నారు. అనకాపల్లి అభ్యర్థి సీఎం రమేష్ కి ఒక సీఎం స్థాయిలో కూటమి నేతలు స్వాగతం పలకడం పట్ల ప్రజల్లో కూడా భిన్న తీరులలో స్పందన వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: