రాయలసీమ: మడకశిరలో ఏ పార్టీకి ఎంత బలం..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల హడావిడి చూస్తూ ఉంటే.. సామాన్యుల తలరాతలను కూడా మార్చే విధంగా ఉంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ , టీడీపీ, జనసేన మధ్య హోరాహోరీగా అభ్యర్థుల విషయంలో పోటీ జరుగుతోంది. కొన్ని పార్టీలు అతి సామాన్యులకు సైతం టికెట్ ఇస్తూ.. బరిలో నిలుస్తూ ఉన్నారు..  రాజకీయం అంటే కేవలం చేతి నిండా డబ్బులు,  పేరు రాతలు ఉండాల్సిన అవసరం లేదంటూ ఎంతోమంది అభ్యర్థులు ఇప్పటికే నిరూపించారు.. ముఖ్యంగా రాయలసీమలో సత్యసాయి జిల్లా  మడకశిర లో ఉండేటువంటి టీడీపీ , వైసీపీ అభ్యర్థులు ఆంధ్ర అసెంబ్లీలోనే చాలా స్పెషల్ గా మారిపోయారు.
YCP - ఈరలక్కప్ప:
ఇండియా హెరాల్డ్ అందిస్తోన్న ప్రత్యేక కథనం మేరకు వైసీపీ పార్టీ నుంచి ఈరలక్కప్ప పోటీ చేయబోతున్నారు.. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎస్సీ స్థానం ఉండడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు.. ఉపాధి కూలీకి వెళ్లే ఈరలక్కప్ప ను మడకశిర అభ్యర్థిగా ప్రకటించారు.. ఈయన గతంలో ఒక ప్రైవేటు టీచర్ గా కూడా పని చేశారు. అంతేకాకుండా ఇందిరమ్మ హయాంలో మంజూరైన ఇంటిలోనే నివసిస్తున్నారట.. ఖాళీ సమయాలలో చింతపండు కూడా అమ్ముకునే వారట.. అయితే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను సర్పంచ్  అయ్యానని.. తన తీరుతోనే అధిష్టానం తన పైన దృష్టి పెట్టిందని.. అందుకే తనకు ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చారని.. ఇది అసలు ఊహించలేదని ఈరలక్కప్ప  తెలియజేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నందుకు సామాన్యులు కూడా ఇంతటి స్థాయికి ఎదిగేలా సీఎం జగన్ చేశారని..  కచ్చితంగా తన నియోజకవర్గాన్ని గెలిపించుకునేందుకే తాను కృషితో పని చేస్తున్నానంటూ వెల్లడించారు.

TDP - డాక్టర్ సునీల్ కుమార్:
ఇండియా  హెరాల్డ్ కు అందిన  సమాచారం మేరకు..వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సత్యసాయి జిల్లా మడకశిరలో టిడిపి అభ్యర్థిగా సునీల్ కుమార్ టిడిపి తరపు నుంచి పోటీ చేయబోతున్నారు.. టికెట్ ప్రకటన వెలువడినప్పుడు టిడిపిలో చాలా అసంతృప్తులు కూడా మొదలయ్యాయి. అయినప్పటికీ సునీల్ కుమార్ మాత్రం వెనకడుగు వేయకుండా ఈసారి తాను అధికారంలోకి రావాలని ప్రయత్నంతో ప్రజలలో మమేకం అవుతూ ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే సంపాదన సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని.. తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన కొన్ని విషయాలను తెలియజేస్తూ ముందుకు వెళుతున్నారు.
ఇండియా హెరాల్డ్ తెలుపుతున్న విషయం ప్రకారం.. వైసీపీ కార్యకర్త సామాన్య కార్యకర్త అని.. ముఖ్యంగా మడకశిర ఎస్సీ నియోజకవర్గం లో చాలామంది నిరుపేద కుటుంబాలు  ఉండడం చేత వైసీపీ పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. మరొకవైపు టిడిపి అధినేత చంద్రబాబు సామాన్యులపై వ్యంగ్యంగా మాట్లాడుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే సామాన్యులు సామాన్యులనే అభ్యర్థులుగా నిలబెట్టి వారికి అధికారం కట్టబెట్టాలని చూస్తున్న నేపథ్యంలో వైసిపి పార్టీ తరపున నిలబడిన వ్యక్తికే ఈసారి సీటు కట్టబెట్టాలని చూస్తున్నారు మొత్తానికైతే చంద్రబాబు మాటలే ఇక్కడ వైసిపిని నిలబెట్టేలా చేస్తున్నాయని చెప్పవచ్చు.
మరొకవైపు చంద్రబాబు అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలకు ఏం చేస్తారనే కోణంలో టిడిపి అభ్యర్థి ప్రచారాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: