ఏపీ : పేదోళ్లని పక్కనపెట్టి.. కోట్లు ఇచ్చినోళ్లకే.. చంద్రబాబు టికెట్లు?

praveen
ప్రస్తుతం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఆంధ్రాలో రాజకీయం ఎంతలా వేడెక్కిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అధికారం లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించడమే  లక్ష్యం గా మాస్టర్ మైండ్ చంద్రబాబు వ్యూహాలను పన్నుతున్నారు. ఈ క్రమం లోనే జనసేన, బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని మరీ ముందుకు సాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే అన్ని పార్టీలు కూడా అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరు అన్న విషయం పై పూర్తిస్థాయి ప్రకటన చేశాయి.

 కాగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా కొంతమంది సామాన్య కార్యకర్తలకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం చర్చనీయాంశం గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమం లోనే తమది పేదల ప్రభుత్వం అన్న విషయాన్ని ఈ టికెట్ల కేటాయింపు ద్వారా చెప్పకనే చెప్పింది వైసిపి. అదే సమయం లో తమలాగా ఇతర పార్టీలు పేదలకు పెద్దపీట వేయడం లేదు అంటూ.. విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం. కాగా ఇదే విషయం పై అటు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి స్పందిస్తూ చంద్రబాబు పై సంచలన విమర్శలు చేశాడు.

 డబ్బు ఉన్నోళ్లకే తెలుగు దేశం చీప్ చంద్రబాబు టికెట్లు కేటాయించారు అంటూ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర లో కూడా టిడిపి బీసీలను కాదని ఓసీలకు టికెట్లు ఇచ్చింది. పేదోళ్ళని పక్కన పెట్టి కోట్లు కుమ్మరించే వారికి టికెట్లను కట్ట బెట్టింది. ఇలా చంద్రబాబు చేస్తున్న గారడిలను, మోసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు తప్పకుండా బుద్ధి చెబుతారు అంటూ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గాలను శాసనసభలకు పంపేందుకు సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: