రేవంత్‌రెడ్డి: అదను చూసి కేసీఆర్‌ ఆయువుపట్టుపైనే కొడుతున్నారుగా?

Chakravarthi Kalyan
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ ప్రాంతంలోనే బీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయి. కేసీఆర్ పరువు కాపాడింది హైదరాబాద్‌ ప్రాంతమే. ఇక్కడ కాంగ్రెస్‌ కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కించుకుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్‌ ఆయువు పట్టయిన హైదరాబాద్‌ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు. రాష్ట్ర రాజధానిలో బీఆర్‌ఎస్‌ను గట్టిగా దెబ్బ తీస్తున్నారు.

ఈ ప్రాంతంలో చేరికలను బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు, మాజీ మేయర్లు, సీనియర్ నేతలు హస్తం గూటికి చేరారు. ఏకంగా మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ఎత్తుగడలకు బల్దియాలో బీఆర్‌ఎస్‌ రోజురోజుకు బలహీనపడుతోంది. ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీని వీడారు. ఇంకా కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచన చేరే ఆలోచనలో ఉన్నట్లు ఇండియా హెరాల్డ్‌కు సమాచారం వస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి స్థానాలను దక్కించుకునే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ ప్రాంతంపై గురిపెట్టారు.  కార్పొరేటర్ల దగ్గరి నుంచి మేయర్లు, ఎమ్మెల్యేల వరకు ఒక్కొక్కరుగా.. కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో మొదలైన చేరికలు కొనసాగుతూనే  ఉన్నాయి. ఇటీవలే డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కాంగ్రెస్‌లోకి మారారు.

ఇప్పుడు బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలోకి మారిపోయారు. ఎన్నికల సమయానికి మరో 15 మంది కార్పొరేటర్లను తమ పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ నుంచి కొంత మంది కార్పొరేటర్లు చేరుతారనే ఇండియా హెరాల్డ్‌కు సమాచారం అందుతోంది. ఒకవేళ బీఆర్‌ఎస్‌ అవిశ్వాస తీర్మానం పెడితే ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం తొలుత చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని చేర్చుకుని అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయిస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను చేర్చుకొని సికింద్రాబాద్ సీటు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: