బిఆర్ఎస్ : ఇంత జరుగుతున్నా.. కెసిఆర్ పై సానుభూతి ఎందుకు లేదు?

praveen
ఏదైనా తనదాక వస్తే కానీ ఏది అర్థం కాదు అని అంటూ ఉంటారు పెద్దలు. ప్రస్తుతం కేసీఆర్ కు ఈ విషయం బాగా అర్థమవుతుంది. చెరపకురా చెడేవు అనే సామెత కూడా ప్రస్తుత పరిస్థితుల దృశ్య గులాబీ దళపతి కేసీఆర్ కు బాగా సరిపోతుంది. ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ తనను మించిన నాయకుడు లేరు అనే విధంగానే వ్యవహరించారు. ఏకంగా ప్రతిపక్షాలను గడ్డిపోచల్లా చూడలేదు. ఏకంగా ప్రతిపక్షమే లేకుండా చేసుకోవడానికి ఎంతో నిరంకుశంగా వ్యవహరించాడు అన్నది అందరిలో ఉన్న భావన.

  కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కూడా బిఆర్ఎస్లో చేర్చుకుని ప్రతిపక్షమే లేకుండా చేయాలని అనుకున్నారు. అయితే ఇలా తమ పార్టీ ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ లో చేర్చుకున్నారని ఇక కాంగ్రెస్ పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీనిపైన కూడా అప్పట్లో కేసీఆర్ హేళన చేశారు. అయితే ఇక ఇప్పుడు కెసిఆర్ కు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు వచ్చి పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయింది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చింది చేస్తే తర్వాత పరిణామాలు అనుభవించక తప్పదు అన్న విషయం ఇప్పుడు కేసీఆర్ పరిస్థితిని చూస్తుంటే మిగతా రాజకీయ నాయకులకు కూడా అర్థమవుతుంది.

 ఏకంగా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా తమ గూటికి చేర్చుకుంటూ ఉంది  మొన్నటివరకు బిఆర్ఎస్ లో కీలక పదవులు చేపట్టిన నమ్మిన బంటు లాంటి నేతలు సైతం పార్టీని వీడుతుండడంతో ఏకంగా గులాబీ బాస్ కేసిఆర్ గుండెల్లో సైతం గుబులు మొదలైంది. ఇంత జరుగుతున్న అటు ప్రజల్లో మాత్రం కేసీఆర్ పై సానుభూతి అస్సలు రావడం లేదు. దీనికి కారణం ఒకప్పుడు అధికారంలో ఉండగా కెసిఆర్ వ్యవహార శైలే అన్నది తెలుస్తుంది. ప్రతిపక్షాలను హేళన చేసిన కేసీఆర్ ఇక ఇప్పుడు అదే ప్రతిపక్ష హోదాలో ఉండి.. చేసిందానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాడని అందరూ అనుకుంటున్నారట ప్రజలు. అయితే ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న నేతలకు వద్దు అని కేసీఆర్ చెప్పినా.. నీవు నేర్పిన విద్యయే కదా అంటూ  కెసిఆర్ కే నీతులు చెబుతున్నారట ఇలా పార్టీని వీడుతున్న నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: