టీడీపీ కార్య‌క‌ర్త గుండెలు పిండేసే వేద‌న‌... సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోన్న క‌న్నీటి ఘోష‌..!

RAMAKRISHNA S.S.
ఎవ‌రు రాశారో కాని.. తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త స‌గ‌టు వేద‌న, ఆవేద‌న‌, క‌న్నీటి ఘోష మెసేజ్ ఒక‌టి సోష‌ల్ మీడియా స‌ర్కిల్స్‌లో బాగా వైర‌ల్ అవుతోంది. ప్ర‌తి కార్య‌క‌ర్త‌ల‌ను ఆలోచింప‌జేస్తోంది. పార్టీ అధిష్టానం పొత్తుల పేరుతోనే మ‌రోక విధంగానో క‌ష్ట‌ప‌డిన నేత‌ల‌కు ఏ స్థాయిలో అన్యాయం చేసిందో.. బ్రోకరిజం చేసుకునే నేత‌ల‌ను ఎలా ఎంక‌రేజ్ చేస్తుందో త‌న ఆవేద‌న‌ను బాగా రాసుకొచ్చారు. సోష‌ల్ మీడియాలో ఊపేస్తోన్న ఈ ఆర్టిక‌ల్ సారాంసం ఇది..
పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే తెలుగుదేశంపార్టీ విలువలు వదులుకుంది. నాడు ఆత్మగౌరవంతో పెట్టిన పార్టీ నేడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితికి దిగజారింది. నాడు ఢిల్లీలో దమ్ముగా నిలబడిన పార్టీ నేడు బ్రోకర్ల కాళ్ళ దగ్గర బేకారిగా నిలబడింది..
- వైజాగ్ లో కేకే రాజు (గంటా మీద ఓడిపోయిన వైసీపీ అభ్యర్ధి) చంద్రబాబు గారిపై చెప్పులు విసిరినప్పుడు, చంద్రబాబు గారు నడిరోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినప్పుడు ఆ ప్రాంత ఎమ్మెల్యే అయ్యుండి కూడా గడప దాటని కనీసం స్పందించని గంటాకి ఎక్కడ అడిగితే అక్కడ టికెట్ ఇచ్చే స్థాయికి పార్టీ దిగజారిపోయింది.
- పార్టీకోసం ప్రాణత్యాగం చేసిన పరిటాల రవి కొడుకు నాలుగేళ్లుగా ధర్మవరం నియోజకవర్గములో కార్యకర్తలకు అండగా నిలిచి, పార్టీని నిలబెట్టిన శ్రీరామ్ కి టికెట్టు ఇవ్వలేదు.
దళిత సామాజిక వర్గం జవహర్ గారు, కొవ్వురు లో ఎమ్మెల్యే గా గెలిచి పార్టీ వెళ్లమంటే తిరువూరు లో పోటీ చేయి జగన్ వేవ్ లో ఓడిపోయారు అయినా సరే రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు అయినా టికెట్ లేకపోవటం దురదృష్టకరం.
- నూజివీడు మద్రబోయిన గారు యాదవ సామాజిక వర్గం బిసిలలో,దళితుల్లో పట్టున్న నేత పార్టీలో పోరాటం చేస్తున్న ఆయన్ని పక్కన పెట్టి  అప్ప‌టిక‌ప్పుడు పార్టీ మారి వ‌చ్చిన‌ పార్థసారథికి టికెట్ ఇచ్చారు. ఆయ‌న చంద్ర‌బాబు గారిని, టీడీపీని గ‌త 15 ఏళ్ల‌లో లెక్క‌లేన‌న్ని మాట‌లు అన్నారు. ఇప్పుడు బాబు గారికి ఆయ‌నే ముద్ద‌య్యారు. ప‌దేళ్లు క‌ష్ట‌ప‌డ్డ ముద్ద‌ర‌బోయిన చేద‌య్యారు.
- పోలవరం ఇన్‌చార్జ్‌ బొరగం శ్రీనివాస్ పార్టీ ఏ పోగ్రాం అయిన కాళ్లకి బలపం కట్టుకొని తిరిగన నేత,లాస్ట్ టైం ఖర్చు పెట్టి ఓడిపోయిన సరే బాబు గారు ఏ పోగ్రామ్ పిలుపు ఇచ్చిన అకింతభావంతో పని చేసారు అలాంటి ఆయనకు టికెట్ లేకపోవటం జనసేన కి ఇవ్వటం పోలవరం తెలుగుదేశం క్యాడర్ లో నిరాశ.
- అనపర్తి నియోజకవర్గములో 40 ఏళ్లుగా పార్టీకోసం నిలబడిన నిఖార్సైన రెడ్డి కుటుంబీకుడైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కి టికెట్టు ఇవ్వలేదు
- పార్టీకోసం ప్రాణత్యాగం చేసిన దేవినేని కుటుంబీకుడు కృష్ణా జిల్లాలో చంద్రబాబు చెప్పిన ప్రతి పని చేసిన దేవినేని ఉమకి టికెట్టు ఇవ్వకుండా అప్పుటిక‌ప్పుడు కండువా మార్చిన వసంతకు టికెట్ ఇచ్చారు.
- శ్రీకాకుళం నియోజకవర్గములో 40 ఏళ్లుగా పార్టీకోసం నిలబడిన గుండ కుటుంబీకురాలు గుండ లక్ష్మీదేవి కి టికెట్టు ఇవ్వలేదు.
- ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన గన్ని వీరాంజనేయులు కి టికెట్టు ఇవ్వలేదు. పైగా పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు ఈయ‌న‌కు ఏలూరు జిల్లా పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాలు ఇచ్చి ఆర్థికంగా మ‌రింత క‌ష్టాల్లోకి నెట్టేశారు.
- తిరుపతి నియోజకవర్గంలో భర్త చనిపోయిన తర్వాత పార్టీ బాధ్యతను భుజం మీద వేసుకొని మోసిన మహిళా నేత‌, మాజీ ఎమ్మెల్యే మున్నూరు సుగుణమ్మకి టికెట్టు ఇవ్వలేదు.
- ఇంకా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నిఖారసయిన నాయకులకి టికెట్టు ఇవ్వకుండా వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికలలో సొంత అనుచరులను వైసీపీ లో జాయిన్ చేసి.. మేయర్ పదవి టిడిపికి దూరం చేసిన వెన్నుపోటు దారుడిని, కులం పేరుతో ఘర్షణలు పెడుతూ చంద్రబాబుని బెదిరిస్తున్నోడిని, 2019 నుంచి 2023 పార్టీ కార్యక్రమాలలో పాల్గొనని.. ముఖ్యంగా ఆ టైంలో జరిగిన రెండు మహనాడులకి కూడా రానోడిని, అసెంబ్లీలో చంద్రబాబు గారికి అవమానం జరిగినప్పుడు కనీసం స్పందించనోడిని, అధినేతకు చెప్పకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినోడిని, చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ చేయమంటే భయపడి పోనోడిని నాయకుడు అంటారా.? బ్రోకర్ అంటారా.? అలాంటి బ్రోకర్ కి టికెట్టు ఇవ్వటం పార్టీకే కళంకం.
- ఇక నికార్సైన మ‌రో సీనియ‌ర్ నేత అయ్యన్న విషయానికి వస్తే పార్టీ అయ్యన్న కొడుకు విజయ్ కి అనకాపల్లి పార్ల‌మెంటులో పని చేసుకోమని చెప్పికూడా టికెట్ ఇవ్వకుండా మొహం చాటేసారు.
- కోళ్ల విజయ కుమారి,గౌతు శిరీషా లాంటి వారు పార్టీ లో కష్టపడుతున్న చిట్ట చివరి వరకు వారు టికెట్ కోసం పోరాడవలసి వచ్చింది.
- జోన్ 2 లో ఐదు పార్లమెంట్ అధ్యక్షులకు పార్టీ టికెట్ రావకటపోవటం గమనార్హం.
- గంటానేమో పార్టీని బెదిరించి కావాల్సిన దగ్గర టికెట్టు తెచ్చుకోవటం, ఒక వియ్యంకుడిని జనసేన లోకి పంపించి అక్కడ పోటీ చేపించటం, ఇంకో వియ్యంకుడు పార్టీ తరపున నెల్లూరులో పాగా వెయ్యటం చూస్తుంటే పార్టీ నిఖారసయిన నాయకులుకంటే బ్రోకర్లకు విలువిస్తుందన్న‌ది క్లీయ‌ర్‌గా తెలుస్తోంది.
- గంటా లాంటి బ్రోకర్లను పార్టీలకి అతీతంగా నిఖారసయిన కార్యకర్తలందరూ కలిసి ఓడించి రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలి.
ఈ మెసేజ్‌లో పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికి ఏ స్థాయిలో అన్యాయం జ‌రిగిందో చెప్ప‌డంతో పాటు గంటా లాంటి వాళ్లు క‌ష్ట‌ప‌డ‌కుండా పార్టీ లో టిక్కెట్లు తీసుకుని.. ప‌దవుల్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో త‌న ఆవేద‌న క్లీయ‌ర్‌గా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: