గోదావ‌రి: ప‌వ‌న్ సీటు మార్చేసిన దుర్గేష్ కొత్త ప్లేస్‌లో గెలుస్తాడా... టీడీపీ స‌పోర్ట్ చేస్తుందా..!

RAMAKRISHNA S.S.
పశ్చిమగోదావరి జిల్లాలోని డెల్టా లో ఉన్న నియోజకవర్గం నిడదవోలు. ఇది రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అంతర్భాగంగా ఉంటుంది. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శ్రీనివాసులు నాయుడు మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక జనసేన - టిడిపి పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన సీటు ఆశించిన కందుల దుర్గేష్ ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ టిడిపి సీటును మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాటు మరో నేత కుందుల సత్యనారాయణ ఆశించారు. అయితే రాజమండ్రి రూరల్ సీటు ఆశించిన దుర్గేష్ కు అక్కడ సీటు రాలేదు. టిడిపి నుంచి సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల వచ్చే చౌదరికి రూరల్ సీటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో చంద్రబాబు - పవన్ ఇద్దరూ ఆలోచన చేసి దుర్గేష్ ను నిడదవోలుకు పంపారు.
ముందు టిడిపి నేతలు దుర్గేష్ ను వ్యతిరేకించారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి సైతం ధిక్కార స్వరం వినిపించారు. ఆ తర్వాత చంద్రబాబు పిలిచి సర్ది చెప్పడంతో అందరూ ఒకే తాటి మీదకు వస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో దుర్గేష్ కు మరో బలమైన ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జనసేన అభిమానులు.. కాపు సామాజిక వర్గం.. పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఎక్కువగా ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీకి 44 వేల ఓట్లు రాగా.. 2019 ఎన్నికలలో జనసేనకి కూడా భారీగా ఓట్లు వచ్చాయి.
జనసేన - తెలుగుదేశం పార్టీ మధ్య ఓటు ట్రాన్స్‌ఫ‌ర్ సరిగా జరిగితే నిడదవోలులో కందులు దుర్గేష్ 20 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో చాలా సింపుల్గా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శ్రీనివాసరావు నాయుడు పై నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రజలకు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో పాటు చెప్పుకోదగ్గ అభివృద్ధి కూడా చేయలేదు. నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది.
నియోజకవర్గంలో ఉన్న కమ్మ , కాపు సామాజిక వర్గాలు ఒక్కటి అవుతున్న పరిస్థితి ఉంది. అలాగే బీసీలలో మెజార్టీ వర్గాలు ఈసారి కచ్చితంగా కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని కసితో ఉన్నాయి. ఏది ఏమైనా నిడదవోలులో కూటమి అభ్యర్థికి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: