విజేత‌: ' టీడీపీ రామానాయుడు ' హ్యాట్రిక్ ప‌క్కా... మెజార్టీ మీదే లెక్క‌లు.. బెట్టింగులు...!

RAMAKRISHNA S.S.
2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం 23 సీట్లకే పరిమితం అయింది. అంత యాంటీ వేవ్‌ కూడా తట్టుకొని పాలకొల్లులో నిమ్మల రామానాయుడు వరుసగా రెండోసారి విజయం సాధించారు. నిమ్మల గెలవడం మాత్రమే కాదు ఏకంగా 18 భారీ మెజార్టీతో విజయం సాధించి సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశారు. పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నిమ్మల నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పోరాడుతున్నారు. అటు అసెంబ్లీలోను ఆయన గట్టిగా త‌న గ‌ళం వినిపిస్తూ హైలెట్ అయ్యారు.
నాలుగేళ్ల‌లో నిమ్మ‌ల ఏ రోజు ఖాళీగా లేరు. ఇటు నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌టిస్తూ తాను ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు చేసిన అభివృద్ధి చెప్ప‌డంతో పాటు వైసీపీ ప్ర‌భుత్వంలో ఏం అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌న్న విష‌యాన్ని పాల‌కొల్లు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ప్ర‌జ‌ల్లో ఏ మాత్రం త‌న ప‌ట్టు కోల్పోలేదు స‌రిక‌దా.. మ‌రింత‌గా పెంచుకున్నారు. ఇక పార్టీలు, కులాల‌కు అతీతంగా నిమ్మ‌ల‌కు పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్స‌న‌ల్ క్రేజ్ ఉంది.
గ‌త ఎన్నిక‌ల్లో నిమ్మ‌ల త‌న వేవ్‌లో కూడా భారీ మెజార్టీతో గెల‌వ‌డం జ‌గ‌న్‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేదు. అందుకే తాను ముఖ్య‌మంత్రి అయ‌న‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్ నిమ్మ‌ల‌ను పాల‌కొల్లులో ఎలా ?  ఓడించాలా ? అని ర‌క‌ర‌కాల ఎత్తులు వేసుకుంటూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే బాబ్జిని ఆరు నెల‌ల‌కే ప‌క్క‌న పెట్టేసి క‌వురు శ్రీనివాస్‌కు ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇచ్చారు. రామానాయుడికి బ్రేకులు వేసేందుకు క‌వురుకు డీసీసీబీ చైర్మ‌న్‌, ఆ త‌ర్వాత జ‌డ్పీ చైర్మ‌న్‌.. ఆ త‌ర్వాత య‌ల‌మంచిలి జ‌డ్పీటీసీ.. ఆ వెంట‌నే ఎమ్మెల్సీ ఇలా ఎన్ని ప‌ద‌వులు ఇచ్చినా పార్టీ గ్రాఫ్ పెర‌గ‌లేదు స‌రిక‌దా.. మ‌రింత డౌన్ అయ్యింది.
ఇక క‌వురును ప‌క్క‌న పెట్టేసిన జ‌గ‌న్ ప్ర‌స్తుత ఇన్‌ఛార్జ్ గుడాల గోపికి సీటు ఇచ్చారు. ఆయ‌న‌కు సీటు ఇచ్చాక ఫైన‌ల్‌గా బీ ఫామ్ వ‌స్తుందా ? అన్న సందేహాల న‌డుమ ఎలాగోలా క‌ష్ట‌ప‌డుతూ పార్టీని లాక్కుస్తున్నారు. రామానాయుడు కాపు సామాజిక వ‌ర్గం కాగా, గుడాల గోపీ బీసీల్లో బ‌ల‌మైన శెట్టిబ‌లిజ వ‌ర్గం. జ‌గ‌న్ బీసీ ఈక్వేష‌న్‌తోనే రామానాయుడిని ఓడించాల‌ని అనుకున్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో బీసీల్లో ఎక్కువ మంది టీడీపీ వైపే ఉన్నారు. జ‌న‌సేన పొత్తు, టీడీపీ ఓటు బ్యాంకు.. రామానాయుడు ప‌ర్స‌న‌ల్ ఓటు బ్యాంకు వీట‌న్నింటిని త‌ట్టుకుని ఇక్క‌డ వైసీపీ క్యాండెట్ గుడాల గోపీ గెల‌వ‌డం చాలా అంటే చాలా క‌ష్టం. ఏదైనా అద్భుతం జ‌రిగి తూర్పున ఉద‌యించాల్సిన సూర్యుడు ప‌డ‌మ‌ర ఉద‌యిస్తేనే ఇక్క‌డ గోపీ గెల‌వ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: