టార్గెట్ ప‌వ‌న్‌.. జ‌గ‌న్ ఎందుకు ఉడికి పొతున్నారో తెలుసా..!

RAMAKRISHNA S.S.
ఏపీలో వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి ఎవ‌రు? అంటే.. ఠ‌క్కున ఎవ‌రైనా ఏం చెబుతారు?  టీడీపీ అనే. మాజీ సీ ఎం చంద్ర‌బాబు అనే! కానీ, ఇది పైకి క‌నిపించే రాజ‌కీయం. కానీ, అంత‌ర్గ‌తంగా చూస్తే.. ఈ రాజ‌కీయం చాలా డిఫ‌రెంట్‌గా ఉంది. జ‌గ‌న్ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబు అనే మాట 25 శాత‌మే. అస‌లు ప్రత్య‌ర్థి జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణే. ఔను.. ఇది ముమ్మాటికీ నిజం. జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి.. ఓడించి తీరాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న నాయ‌కుడు ప‌వ‌నే.
ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. కొన్ని డౌట్లు వ‌స్తాయి. ప‌వ‌న్‌కు 10 శాతం ఓటు బ్యాంకు లేదు. ప‌ది మంది ఎ మ్మెల్యేలు కూడా లేరు. ఒక్క ఎంపీ కూడా లేరు క‌దా.. ప‌వ‌న్ ఎలా జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్తి అవుతాడు అనేది మొద‌టి ప్ర‌శ్న‌. ఇక‌, ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌ని ప‌వ‌న్‌.. క‌నీసం త‌ను ద‌క్కించుకున్న 21 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అభ్య‌ర్థులు లేక‌.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప‌వ‌న్‌ను జ‌గ‌న్ టార్గెట్ చేసుకోవ‌డం ఏంటి?  మ‌రీ క్యామెడీ కాక‌పోతే.. అంటారా?  
ఇక్క‌డే ఉంది.. అస‌లు సిస‌లు.. లాజిక్‌. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు రెండు కూడా.. చాలా ట‌ఫ్ అయిపోయాయి. ఎక్క‌డా కూడా ఇవి లూజ్‌గా అయితే లేవు. ఏ నియోజ‌క‌వ‌ర్గం చూసు కున్నా.. ట‌ఫ్ ఫైట్ జ‌రుగుతోంది. వాస్త‌వానికి రెండేళ్ల కింద‌ట జ‌గ‌న్ ఇలా అనుకోలేదు. అంతా ఏక‌ప‌క్షంగా నే ఓటెత్తుతార‌ని.. ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారు. తాను అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, సంక్షేమం వంటివి వైసీపీకి క‌లిసి వ‌స్తాయ‌ని కూడా భావించారు.
ఇది వాస్త‌వ‌మే. కానీ, ఎప్పుడైతే.. ప‌వ‌న్ వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల్చ‌న‌ని ప్ర‌క‌టించారో.. అదేస‌మ యంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారో.. ఇంకా.. చెప్పాలంటే.. ఈ రెండు పార్టీల‌కూ.. బీజేపీని తోడుగా తెచ్చుకున్నారో.. అప్పుడు.. ఏపీలో ఎన్నిక‌లు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ట‌ఫ్ అయిపోయాయి. జ‌గ‌న్ అనుకున్న‌ట్టుగా అయితే.. ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌ని తేలిపోయింది. ఎవ‌రు గెలిచినా.. చాలా చెమ‌టోడ్చాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి?  అంటే.. ప‌వ‌న్‌.
ప‌వ‌న్ అనే వ్య‌క్తి పొత్తులు పెట్టుకోక‌పోయినా.. వైసీపీ వ్య‌తిర‌క ఓటు బ్యాంకు చీల్చ‌న‌ని కంక‌ణం క‌ట్టుకోక‌పో యినా.. సీఎం జ‌గ‌న్ అస‌లు సుదీర్ఘ రాజ‌కీయం బ‌స్సు యాత్ర‌కు శ్రీకారం కూడా చుట్టేవారు కాదు. కానీ, ప‌వ‌న్ ఎఫెక్ట్‌తో ఎన్నిక‌లు చాలా క్లిష్టంగా మారిపోయాయి. మూడు పార్టీలు చేతులు క‌లిపాయి. ఇదీ.. అస లు ప‌వ‌న్‌ను జ‌గ‌న్ అంత‌గా టార్గెట్ చేయ‌డానికి... పిఠాపురంలో ఆయ‌న‌ను ఓడించేందుకు స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డ‌డానికి కార‌ణ‌మైంది. ఈ విష‌యం తెలియ‌క వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్ గురించి ఇంకా చ‌ర్చించుకుంటూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: