నెల్లూరు :అలా జరగడంతో పరువు పోగొట్టుకున్న లోక్ సభ అభ్యర్థి....!!
అయితే ఆలా జరగడం గమనించిన ప్రజారథంపై ఉన్న నాయకులు మహిళలను వెళ్ళొద్దు వెళ్లొద్దు, ఆగండి ఆగండి అంటూ అంటూ మన పెద్దాయన విజయసాయిరెడ్డి గారు ప్రసంగించే వరకు ఆగాలని అక్కడ నుండి వెళ్లిపోతున్న మహిళలను, కార్యకర్తలను వేడుకున్నారు. అయితే వారందరిని ఆపే ప్రయత్నంలో భాగంగా భోజనాలు కూడా ఉన్నాయని అందరూ తినేసి వెళ్లాలని కోరినా కూడా దాని ప్రభావం వాళ్ళ పై పడలేదు అని తెల్సింది.అయితే దీనికి సంబంధించిన అదే వీడియో ప్రస్తుతం ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే ప్రచారరధం పై ఉన్న ఒకనేత మహిళలందరూ ఆగాలని, అందరికీ భోజనాలు ఉన్నాయని, పెద్దాయన మాట్లాడతారని మైకులో గొంతు పోయేలా అరిచినా కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు సరికదా వెనక్కి కూడా తిరిగి చూడలేదు. చెప్పేది వినండి, వెనక్కి రండి, ఇటు చూడండి.వెళ్లిపోయేవాళ్ళందరు మాకు కనిపిస్తున్నారు. దయచేసి మీరు పోవద్దు అంటూ మైకులో పదేపదే చెపుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే అక్కడ జరిగిన సంఘటన అనేది లోకసభ అభ్యర్థి అయినా విజయసాయిరెడ్డి కి జరిగిన ఘోర అవమానంగానే భావించాలి అంటూ అర్ధం చేసుకోవాలి.