ప‌వ‌న్ సొంత ఊళ్లో ఈ సారి జ‌గ‌న్ పార్టీకి డిపాజిట్ లేకుండా చేస్తాడా..?

RAMAKRISHNA S.S.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏంటి ? త‌న సొంత ఊళ్లో జ‌గ‌న్ పార్టీకి డిపాజిట్లు లేకుండా చేయ‌డం ఏంట‌నుకుంటున్నారా ? అస‌లు లెక్క అక్క‌డే ఉంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం. ప‌వ‌న్ అన్న‌ద‌మ్ములు అంద‌రూ అక్క‌డే పుట్టారు. అందుకే సొంత ప్రాంతం అంటే మెగా ఫ్యామిలీకి ఎంతో ప్రేమ‌. న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని మొగ‌ల్తూరు వీరి సొంత ఊరు. అది మండ‌ల కేంద్రం కూడా. అందుకే చిరంజీవి ప్ర‌జ‌రాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు న‌ర‌సాపురం ప‌క్క‌నే ఉన్న పాల‌కొల్లులో పోటీ చేశారు.
ఇక మొన్న ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌నే ఉన్న భీమ‌వ‌రంలో పోటీ చేస్తే.. ఇదే న‌ర‌సాపురం పార్ల‌మెంటు నుంచి ప‌వ‌న్ మ‌రో సోద‌రుడు నాగ‌బాబు పోటీ చేశారు. సొంత ప్రాంతం ఈ ముగ్గురు మెగా అన్న‌ద‌మ్ముల‌ను గెలిపించ లేదు. అది వేరే విష‌యం. అయితే ఈ ప్రాంతంలో మెగాభిమానులు బాగా ఎక్కువ‌. కాపు ఓట‌ర్లు కూడా ఎక్కువే. అందుకే అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం.. త‌ర్వాత జ‌న‌సేన ఇక్క‌డ ఓడిపోయినా భారీగా ఓట్లు కొల్ల‌గొట్టాయి. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన న‌ర‌సాపురం అసెంబ్లీలో ఓడిపోయినా వైసీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చింది.
ఇక్క‌డ టీడీపీ నుంచి పోటీ చేసిన అప్ప‌టి ఎమ్మెల్యే బండారు మాధ‌వ‌నాయుడికి కేవ‌లం 21 వేల ఓట్లు రావ‌డంతో పాటు డిపాజిట్ రాలేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ చంద్ర‌బాబు పార్టీకి డిపాజిట్ గ‌ల్లంత‌య్యేలా చేసిన ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీకి కూడా అలాంటి ఘోర ప‌రాభ‌వ‌మే మిగుల్చుతుందా ? అన్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. మామూలుగా అయితే జ‌న‌సేన ఒంట‌రిగా పోటీ చేసి గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది.
ఇప్పుడు జ‌న‌సేన బ‌లంకు తోడు గా బీజేపీ, టీడీపీ బ‌లం కూడా క‌లిసి వ‌చ్చింది. పైగా అక్క‌డ జ‌న‌సేన బీసీల‌కు సీటు ఇచ్చింది. వైసీపీ నుంచి క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్ర‌సాద‌రాజు పోటీ చేస్తున్నారు. అందుకే ఈ సారి కాపులు, బీసీలు, శెట్టిబ‌లిజ‌లు, మ‌త్స్య‌కారులు అంద‌రూ జ‌న‌సేన వైపే ఉంటార‌ని అంటున్నారు. మ‌రి ఇన్ని సానుకూల‌త‌ల మ‌ధ్య ఇక్క‌డ జ‌న‌సేన ఏ స్థాయిలో ఘ‌న‌విజ‌యం సాధిస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: