కాంగ్రెస్ : లోక్ సభ ఎన్నికల 8వ లిస్టు విడుదల... తెలంగాణ నుండి వారికి సీట్లు..!

Pulgam Srinivas
పోయినసారి లోక్ సభ ఎన్నికల ముందుతో పోలిస్తే ఈ సారి కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోకి ఫుల్ జోష్ లో పాల్గొనబోతుంది. అందుకు ప్రధాన కారణం పోయిన సారితో పోలిస్తే ఈ సారి పార్లమెంట్ ఎలక్షన్ ల కంటే ముందు జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ ను చూపించడంతో దేశ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అని కాంగ్రెస్ శిబిరాలు చాలా బలంగా నమ్ముతున్నాయి.

దానితో మరికొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ఫుల్ గా కసరత్తు చేస్తూ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉంటాయో వారికే సీట్ లను కట్టబెడుతూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ హై కమాండ్  7 లిస్టులను విడుదల చేసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం 8 వ లిస్టు ను కూడా విడుదల చేసింది. బుధవారం అనగా మార్చి 27 వ తేదీన రాత్రి ఆలస్యంగా వచ్చిన 8 వ ఈ జాబితాలో మొత్తం 14 అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.

ఇందులో జార్ఖండ్ , మధ్యప్రదేశ్ , తెలంగాణ , ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై మధ్యప్రదేశ్‌లోని గుణ స్థానం నుంచి రావ్ యద్వేంద్ర సింగ్‌కు అవకాశం ఇవ్వగా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ విదిశా నుంచి ప్రతాప్ భాను శర్మను పోటీకి దింపింది.

ఇక తెలంగాణలో ఉన్న మొత్తం 17 స్థానాలకు గాను ఇప్పటికే 9 సీట్ లలో అభ్యర్థులను ఖరారు చేయగా.. తాజాగా మరో నలుగురితో కూడిన జాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ , ఖమ్మం , వరంగల్ స్థానాలకు మాత్రమే తెలంగాణ లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ 8 వ జాబితాలోని తెలంగాణ అభ్యర్థులు అభ్యర్థులు విరే ...

నిజామాబాద్ లో తాటిపర్తి నుండి జీవన్ రెడ్డి. ఆదిలాబాద్(ఎస్టీ) నుండి డాక్టర్ సుగుణ కుమారి. మెదక్ నుండి నీలం మధు. భువనగిరి నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్రం నుండి 8 వ జాబితాలో చోటు దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: