"సలార్ 2" పై వస్తున్న ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదంట..!

MADDIBOINA AJAY KUMAR
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితం "సలార్ పార్ట్ 1" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... ప్రశాంత నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు , పృధ్వీరాజ్ సుకుమరన్ ,  శ్రేయ రెడ్డి , బాబి సింహా ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించింది.

ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ సినిమా యొక్క రెండవ భాగానికి "సలార్ శౌర్యంగ పర్వం" అనే టైటిల్ ను ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అనౌన్స్ చేశారు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే "సలార్ పార్ట్ 2" కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. అలాంటి సమయం లోనే ఈ మూవీ కి సంబంధించిన ఓ వార్త వైరల్ అయింది.

అసలు విషయం లోకి వెళితే ... గత కొన్ని రోజులుగా "సలార్ 2" లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కియార అద్వానీ నటించబోతున్నట్లు , ఈమె పాత్ర రెండవ భాగంలో సెకండ్ హాఫ్ లో రానున్నట్లు , అలాగే ఈమె ఇందులో ఓ ఐటమ్ సాంగ్ కూడా చేయబోతున్నట్లు ఇలా ఈమె పాత్ర పై అనేక రకాల వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శృతి హాసన్ మాత్రమే "సలార్ 2" లో హీరోయిన్ గా ఉండనున్నట్లు , మరే ఇతర హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉండే అవకాశం లేదు అని ... కియార అద్వానీ "సలార్ 2" లో నటించబోతుంది అని వస్తున్న వార్తలు అన్ని రూమర్స్ అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: