రాయలసీమ: సీటు కోసం సూరి-పరిటాల శ్రీరామ్ .. పంతం తగ్గెనా..!!

Divya
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి ధర్మవరం అసెంబ్లీ సీటు పైన ఇంకా పీటమూడి వీరడం లేదు.. ముఖ్యంగా ఈ సీటును కూటమిలో భాగంగా ఏ పార్టీకి ఇస్తారని విషయం పైన అభ్యర్థి ఎవరనే విషయం పైన చాలా ఉత్కంఠత కొనసాగుతోంది. అటు బిజెపికి వచ్చిన లేకపోతే టిడిపికి వచ్చినా కూడా తానే బరిలోకి దిగబోతానంటూ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తెలియజేస్తున్నారు.. అంతేకాకుండా ప్రచారం కూడా అప్పుడే మొదలు పెట్టేసినట్టుగా తెలుస్తోంది. మరొకవైపు కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినటువంటి తనకు టికెట్ ఇవ్వాలంటూ కూడా పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.


అయితే టికెట్ విషయంలో మాత్రం ఎవరూ కూడా తగ్గడం లేదు.. ఎవరి పట్టుదలతో వారు ముందుకు వెళ్తూ తమ బల ప్రదర్శనకు కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఫ్లెక్సీల విషయంలో కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణ కూడా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు కచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కూటమి సైతం చాలా భిన్నంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోబోతుందని వార్తల వినిపిస్తున్నాయి.

అదేమిటంటే 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత వరదాపురం సూరి కొన్ని కారణాల చేత బీజేపీలోకి చేరారు.. అప్పుడు ధర్మవరం టిడిపి ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ వచ్చారు.. స్థానిక ఎన్నికలలో కూడా అక్కడ టిడిపి అసలు ఖాతా కూడా తెరవలేదు. దీంతో పరిటాల శ్రీరామ్ అక్కడ విఫలమయ్యారని చెబుతున్నారు. యువగలం పాదయాత్రలో శ్రీరామ్ చెయ్యి పైకెత్తి గెలిపించాలని లోకేష్ కోరినప్పటినుంచి టికెట్ ఆశ పరిటాల కుటుంబంలో మొదలయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.

రాప్తాడు లో ఓడిపోయిన తర్వాత ధర్మవరం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే ధర్మవరం టికెట్ కోసం అటు పరిటాల శ్రీరామ్ వరదాపురం సూరి ఎవరు తగ్గకపోవడంతో బిజెపి సత్యకుమార్ అనే వ్యక్తిని బరిలోకి దింపబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: