జనసేన సైనికుడికి సహాయం చేసిన ఏపీ సీఎం..!!

Divya
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు చాలామంది నేతలకు అందరూ ఒక్కొక్కరిగా గుర్తుకు వస్తూ ఉంటారు ముఖ్యంగా ఓటర్ల పైన అందరికీ చాలా ప్రేమ పుట్టుకొస్తుంది. ముఖ్యంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ఏం కావాలో అడిగి మరి తెలుసుకొని అలాంటి హామీలను సైతం ఇస్తూ ఉంటారు.. ముఖ్యంగా నోటికి ఏది వస్తే అది చెబుతూ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర నుంచి పోలింగ్ వరకు ఓటర్ల మాటలు వింటూ ఉంటారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది.. రాబోయే ఎన్నికలలో వైసిపి పార్టీని ఓడించాలని ఎన్నో పార్టీలు కూటమిని ఏర్పరచుకొని పలు రకాల వ్యూహాలు ఏర్పరుస్తున్నారు.

కానీ వైసీపీ పార్టీ మాత్రం ఈసారి ఎలాగైనా గెలవాలని చాలా పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు.. ఎన్నికలకు కేవలం 50 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పటినుంచే ప్రచారాన్ని చాలా స్పీడ్ చేశారు.. ప్రతిరోజు ఒక్కో నియోజవర్గాన్ని కవర్ చేస్తూ ఓటర్లను సైతం  ఓటర్లను సైతం పలకరిస్తూ అన్నారు.. ఇప్పుడు తాజాగా జనసైనికుడికి సహాయం చేసిన సీఎం జగన్ మరొకసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు.. చంద్రశేఖర్ అనే జనసేన కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో చికిత్సకు సహాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ అభిమాని తన ట్విట్టర్ లో నుంచి ఒక పోస్టును చేశారు.

దీనికి సంబంధించి సీఎం జగన్ స్పెషల్ సెక్రటరీ ఆరోగ్యశ్రీ ఇన్చార్జ్ డాక్టర్ హరికృష్ణ కూడా స్పందించడం జరిగింది.. దీంతో వెంటనే వైజాగ్ KGH హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామని మా టీం మొత్తం సూపర్డెంట్ తో కూడా మాట్లాడారని చికిత్సకు అయ్యే ఖర్చు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెల్లిస్తామంటూ తెలియజేశారు.. అయితే ఈ ట్విట్ చూసిన ఆరోగ్య మాత్రం జనసైనికులు చాలా ఆనందాన్ని తెలియజేస్తున్నారు..అయితే కొంతమంది ఇదంతా ఓట్ల కోసమే చేస్తున్నారంటూ కామెంట్ చేయగా మరి కొంతమంది ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం చాలా గొప్ప విషయం అంటూ తెలుపుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: