అక్కడి నుంచి పోటీకి దిగుతున్న బాలయ్య చిన్నల్లుడు..!!

Divya
నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు.. బాలయ్య ఆటు సినిమాల నుంచి ఇటు రాజకీయాల వరకు అన్నిటిలో కూడా బాగానే రాణిస్తున్నారు..బాలయ్య హిందూపురం నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగా.. ఇక బాలయ్య పెద్ద అల్లుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అన్న సంగతి తెలిసిందే.. ఇక చిన్న అల్లుడు మిల్లి శ్రీ భరత్ కూడా బిజినెస్ పరంగా బాగానే సక్సెస్ అయ్యారు. అయితే గత కొన్నేళ్లుగా మిల్లి భరత కూడా టిడిపి పార్టీ నుంచి mp గా పోటీ చేయాలని భావించారు.

అలా 2019కి ముందు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన మిల్లి భరత్ గత ఎన్నికలలో వైజాగ్ లో ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అందులో సుమారుగా 4వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు భరత్.. ఆ ఎన్నికలలో అక్షరాల 280000 ఓట్లను సైతం సాధించారు జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ.. అయితే గత కొద్ది రోజుల నుంచి టిడిపి అభ్యర్థుల లిస్టులను సైతం ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాలయ్య చిన్నల్లుడు మిల్లి భరత్ పోటీకి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా మిల్లి భరత్ పేరును సైతం ఖరారు చేశారు చంద్రబాబు.

2019లో చివరికి ఓటమిపాలైన మిల్లీ భరత్ అయితే ఈసారి జనసేన టిడిపి పార్టీ పొత్తులో భాగంగా గెలుస్తామంటూ ధీమాతో ఉన్నారు. కానీ టిడిపి పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమాకు కూడా టికెట్ ఇవ్వకపోవడంతో అటు టిడిపి అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులు మూడో జాబితాలను కూడా విడుదల చేశారు.. అయితే ఈ లిస్టులో ఎక్కడ కూడా సీనియర్ నేత దేవినేని ఉమా పేరు లేకపోవడంతో అటు టిడిపి నాయకులు దేవినేని ఉమా కూడా పార్టీ మారబోతున్నారనే వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి టిడిపిలో ఇప్పటికే టికెట్ల విషయంలో నానా హంగామా జరుగుతోంది.. మరి ఇలాంటి సమయంలో బాలయ్య చిన్నల్లుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: