పిఠాపురంలో జనసేన వర్సెస్ టిడిపి..!!

Divya
పిఠాపురంలో రాజకీయాలు రోజురోజుకీ చాలా హిటెక్కుతున్నాయి.ముఖ్యంగా ఈ ప్రాంతంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ వల్ల రాష్ట్రవ్యాప్తంగా టిడిపి జనసేన పొత్తు పైన చాలా ప్రభావం పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటల వల్ల జనసేన పార్టీ నాయకులు కేడర్ కి చాలా కోపం తెప్పించేలా చేస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారని విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి వర్మ శ్రేణులు పిఠాపురంలో పెద్ద ఎత్తున నాన్న రచ్చ చేస్తూ ఉన్నారు..

పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ లను దూషిస్తూ అనేక మాటలను కూడా అన్నారు.. దీంతో అక్కడి నేత వర్మను పిలిపించి చంద్రబాబునాయుడు సర్ది చెప్పిన ఒక ఎమ్మెల్సీ మినిస్టర్ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో జనసేన పార్టీకి మద్దతు ఇస్తానంటూ వెల్లడించారు.. ఇప్పటివరకు బాగానే ఉన్న వర్మ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కనిపించలేదట.. కేవలం జన సైనికులను మాత్రమే రెచ్చగొట్టే విధంగా వాక్యాలు చేస్తూ కోపాన్ని కలిగిస్తున్నారు వర్మ.. ఇటి వల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒకవేళ బిజెపి పెద్దలు ఎంపీగా పోటీ చేయమని ఒత్తిడి చేస్తే కచ్చితంగా ఉదయ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా చేస్తారని నేను ఎంపీగా నిలబడతానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ఈ వాక్యాల పైన వర్మ తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ పోటీ చేయకుంటే ఆస్థానం నుంచి నేను టిడిపి తరఫున పోటీ చేస్తానని వర్మ వెల్లడించారు. ఈ విషయం పైన తనకు చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారని పొత్తులో ఉన్న అధినేత పోటీ చేసే స్థానం పైన ఆయన మాటలపైన వర్మ ఎలాంటి గౌరవం మాత్రం ఇవ్వలేదు. దీంతో జనసేన నేతలు వర్మాను సస్పెండ్ చేయాలని అతని క్రమశిక్షణలో పెట్టాలని అభిమానులు టిడిపిని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే పిఠాపురంలో జనసేన వర్సెస్ టిడిపి అనేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: