షాక్: జనసేనకు బాబు షాక్.. మరో రెండు సీట్లు తగ్గింపు..!!

Divya
2024 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు పావులు కలుపుతూ టిడిపి జనసేన బిజెపి అలయన్స్తో ముందుకు వెళ్లాలని అందులో భాగంగా సీట్ల విషయంలో కూడా సర్దుబాటు చేసుకుని ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు. వైసీపీ పార్టీని ఎదుర్కొనేందుకు ఇలా మూకుమ్మడిగా వెళ్లాలని చూస్తున్నారు. పొత్తులో భాగంగా కీలక స్థానాలను వదులుకోవడానికి కూడా చంద్రబాబు సైతం సిద్ధమయ్యారు. ఈసారి జరగబోయే ఎన్నికలకు చంద్రబాబు చాలా కీలకమని చెప్పవచ్చు. ఎలాంటి చిన్న అవకాశాన్ని కూడా తాను వదులుకోవడం లేదన్నట్లుగా తెలుస్తోంది.

అందుకే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని తెలియజేసిన వెంటనే నియోజవర్గ టిడిపి నేతలు కూడా ఆగ్రహాన్ని తెలిపారు. దీంతో అక్కడి నేతలను పిలిపించి చంద్రబాబు ఆయనతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గెలుపుకు సహకరించాలని కూటమి అధికారంలోకి రాగానే పదవి ఇస్తానంటూ చెప్పడంతో వర్మ వెనక్కి తగ్గారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఇలా ఉండగా పొత్తులో భాగంగా బిజెపి జనసేన కేటాయించిన స్థానాలపై టిడిపి నేతలు చాలా అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది.. బిజెపికి 10 స్థానాలు జనసేనకు 21 స్థానాలు కేటాయించారు.. టిడిపి బలంగా ఉన్నచోట్ల జనసేన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం పైన చాలామంది అసంతృప్తితో ఉన్నారట.

దీంతో టీడీపీ పక్కా గెలిచే స్థానాలని బిజెపి జనసేనకు ఇవ్వడం పైన వైసిపి ఆ స్థానాలను గెలిచే అవకాశం ఉన్నట్లు టిడిపి నేతలకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని పార్టీ స్థాయి వరకు తీసుకువెళ్లగా దీనిపైన ఆలోచించి ఒక నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా బిజెపి నేతలతో చంద్రబాబు చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో బీజేపీ జనసేనలకు మరొక లోక్సభ స్థానాన్ని కూడా కేటాయించి మరో నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ స్థానాలలో టిడిపి పోటీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.. ఇలాంటి ప్రతిపాదనతోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బిజెపి నేతలను కలిసినట్లు సమాచారం. ముఖ్యంగా బిజెపికి అసెంబ్లీ స్థానాల కంటే పార్లమెంటు స్థానాలు ఎక్కువ అవసరం ఉండడంతో వారు కూడా ఆలోచిస్తున్నారు.. దీంతో పవన్ కళ్యాణ్ కూడా మరో రెండు స్థానాలను తగ్గించుకోవాలని సూచన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి బదులుగా మరో పార్లమెంట్ సీట్లను కూడా అదనంగా కేటాయిస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: