సిద్ధం పేరుతో వైసిపి మరో యాత్ర..!!

Divya
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వై నాట్ 175 అనే లక్ష్యంతోనే వైసిపి పార్టీ ఒంటరిగా బరిలోకి దిగబోతోంది.. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి తో దిగబోతున్నాయి. ఇక వామపక్షాలతో జతకట్టిన కాంగ్రెస్ కూడా పోటీలో నిలవబోతోంది. మొత్తం అభ్యర్థులు ప్రకటించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సిద్ధం సభలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ బస్సు యాత్రను ఏపీ సీఎం జగన్ మొదలుపెట్టబోతున్నారు. ఈ బస్సు యాత్ర ఎలా సాగుతుందని విషయానికి వస్తే..

2019 ఎన్నికలలో విజయ శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు వైయస్ జగన్.. ఇప్పుడు మేమంతా సిద్ధమని పేరుతో ఒక బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు.. ఈనెల 20వ తేదీన మేనిఫెస్టో విడుదల తర్వాత 26 లేదా 27వ తేదీ నుంచి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్రను చేయబోతున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులు ఈ యాత్ర కొనసాగుతుందని రోజుకో జిల్లాలో బస్సు యాత్ర ఉండేలా రూట్ మ్యాప్ ని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.. ఉదయం ప్రజలతో ఇంట్రాక్షన్ అయ్యి మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళ సభను నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

అలా మొదటి విడత 21 -24 రోజులలో బస్సు యాత్ర ముగించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.. ఎన్నికల ప్రచార సభలకు ర్యాలీలు రోడ్డు షోలు సభలు వంటివి ప్లాన్ చేసుకుంటూ వెళ్లే విధంగా చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు స్థానంలో ప్రతి నియోజకవర్గాన్ని కూడా కవర్ చేసే విధంగా రూట్ మ్యాప్ వేసేలా ప్లాన్ చేస్తున్నారు. పోలింగ్కు మరో 55 రోజులు సమయం ఉండడంతో పాటు వీలైనంతవరకు ప్రజలలో ఉండేలా ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ చేస్తూ సిద్ధం అనే పేరుతో బస్సు యాత్రలను చేయబడుతున్నారు.. ఐదేళ్ల ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరిస్తూ ప్రజల సలహా సూచనలు మేరకు స్వీకరించి ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: