వైసీపీని గెలిపిస్తున్న బిజెపి.. ఇదే సాక్ష్యం..!!

Divya
ఆంధ్రప్రదేశ్లో బిజెపి పార్టీ మరొకసారి వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేలా చేస్తోంది.బిజెపి పొత్తులో భాగంగా పోటీ చేస్తే స్థానాలపైన వైసీపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రముఖ రాజకీయ వర్గాలనుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. తెలుగుదేశం బిజెపి పార్టీ 2014లో అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకుని పోటీ చేయగా.. ఆ ఎన్నికలలో బిజెపికి చంద్రబాబు నాలుగు పార్లమెంటు స్థానాలను ఇచ్చారు.. విశాఖపట్నం నరసాపురం మాత్రమే బిజెపి విజయాన్ని అందుకుంది. తిరుపతి రాజంపేటలో బిజెపి అభ్యర్థులు ఓడిపోయారు..బిజెపికి చంద్రబాబు ప్రస్తుతం 13 అసెంబ్లీ స్థానాలు ఇవ్వగ కేవలం నాలుగు చోట్ల మాత్రమే బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుంది.
బిజెపికి ఏమాత్రం అంత సీన్ లేదని చాలా క్లియర్ గా కనిపిస్తోంది.2019 ఎన్నికలు బిజెపికి ఆంధ్రప్రదేశ్ ఒక పీడకలగా కూడా మారిపోయింది.. మోడీ ప్రధానిగా రెండుసార్లు వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక సీటు కూడా గెలవలేదు.. మళ్లీ ఈసారి 2024 ఎన్నికలలో జనసేన టిడిపి బిజెపికి పొత్తు సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా బిజెపి 10 స్థానాలు mla స్థానాలలో పోటీ చేయబోతోంది. బిజెపి పోటీ చేసే 6 పార్లమెంటు స్థానాలు తిరుపతి, అరకు ,విజయనగరం స్థానాలలో ఓడిపోతుందని సమాచారం.
10 అసెంబ్లీ స్థానాలకు వస్తే విశాఖ నార్త్, అనపర్తి, పాడేరు, కైకలూరు, శ్రీకాకుళం, విజయవాడ, జమ్మలమడుగు, ఆదోని ,బెస్ట్ బద్వేల్ ,ధర్మవరం నియోజవర్గం నుంచి పోటీ చేయబోతోంది.. పైన చెప్పుకున్న 10 స్థానాలలో విశాఖ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు మినహా మిగిలిన 9 చోట్ల బీజేపీ గెలుస్తుందని గ్యారంటీ మాత్రం లేదు.. బిజెపికి వచ్చిన పది స్థానాలలో ఒకటి మినహాయింపు ఇస్తే మిగిలిన 9 స్థానాలలో వైసీపీకి అప్పగించేలా ఉన్నట్లు తెలుస్తోంది.. అటు పార్లమెంటు సీట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఏపీలో బిజెపికి ఎన్ని సీట్లు పోటీ చేస్తే వైసిపికి అన్ని ఎక్కువగా సీట్లు వస్తాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: