గత నెల ఫిబ్రవరి నెలలో తమిళ అగ్ర నటుల్లో ఒకడైన దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. ఆ పార్టీలో కొత్త సభ్యత్వ నమోదుకు ఇటీవల విజయ్ శ్రీకారం కూడా చుట్టారు.2026 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా , తమిళనాడు రాజకీయాలలో మార్పు కోసం అందరూ ముందుకు రావాలని దళపతి విజయ్ పిలుపునిచ్చారు. ఇందుకు ఒక యాప్ ను కూడా డిజైన్ చేసి దాని ద్వారా నూతన సభ్యత్వ నమోదుని ప్రారంభించారు.తన అభిమానులతో పాటు తమిళనాడు ప్రజలు తమ పార్టీ లో సభ్యులుగా చేరాలని దళపతి విజ్ఞప్తి చేశారు. ఇక విజయ్ పిలుపు తో నూతన సభ్యులు భారీగా తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ లో ప్రకటిస్తున్న నూతన పదవులపై వివాదం అనేది రాజుకుంది. తమిళ నటుడు విజయ్ పార్టీ పై విమర్శలు ఎక్కువగా మొదలయ్యాయి. పార్టీకి సంబంధించిన ముఖ్య పదవుల్ని అమ్ముకుంటున్నారని అభిమానులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవులను సభ్యులు తమ బంధువులకి, తమ సన్నిహితులకి అమ్ముకుంటున్నారని నామక్కల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆరోపించడం జరిగింది. తక్షణమే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ స్పందించాలన్నారు.
నిజమైన కార్యకర్తలకు మాత్రమే అవకాశమివ్వాలన్నారు.పదవులని అమ్ముకుంటున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే కేవలం విజయ్ ని మాత్రమే నెటిజన్స్ ట్రోల్ చెయ్యడం లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తమిళ నటులు అందరిని ఇప్పుడు తెగ ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఒక్క MGR, జయలలిత తప్ప ఎవరూ కూడా తమిళనాడు రాజకీయాల్లో అంతగా నిలదొక్కుకోలేదు. విజయ్ కాంత్ కొన్నాళ్ళు గట్టిగా నిలబడ్డ తరువాత ఆయన అనారోగ్యం బారిన పడి డౌన్ అయిపోయారు. ఆ తరువాత రజినీకాంత్ పార్టీ పెట్టాలని భావించి ఎందుకులే అని ఆలోచన మార్చుకున్నాడు. కమల్ హాసన్ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయ్యాడు. రీసెంట్ గా ఇంకో హీరో శరత్ కుమార్ కూడా తన పార్టీని బిజేపీలో విలీనం చేశాడు.ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టి ఒక్క మీటింగ్ కానీ ప్రజలని కలవడం కానీ చెయ్యలేదు. అందువల్ల తమిళ హీరోలని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.