నేను వైసిపి కొవర్టా.. పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయినా హరిరామజోగయ్య..!!

Divya
టిడిపిలో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లను ఇవ్వడం నుండి అటు టిడిపి జనసేన పార్టీల మధ్య పలు రకాల విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా జనసేన నేత పై కార్యకర్తలు అభిమానులు కాపు నేతలు సైతం ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతూ ఉన్నారు.. చాలామంది సైతం పవన్ కళ్యాణ్ కు లేఖలు రాస్తూ విమర్శిస్తూ ఉన్నారు.. మరికొంత మంది రాజీనామాలు చేస్తూ ఇతర పార్టీలలో నిలబడుతూ ఉన్నారు. సీనియర్ నేతగా సలహాదారుగా ఉన్న హరిరామజోగయ్య జనసేన పార్టీకి 24 సీట్లు ఇవ్వడం పైన అసలు ఒప్పుకోవడం లేదు ఈ విషయం పైన ఏకంగా బహిరంగ లేకనే రాశారు.

పవన్ కళ్యాణ్ కు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్లపైన విమర్శలు కూడా చేశారు పవన్ కళ్యాణ్.. దీంతో పవన్ కళ్యాణ్ కు మరొక సారి లేఖ రాశారు జనసేన క్షేమం కోరి సూచనలు సలహాలు మీకు నచ్చినట్టు లేవంటూ అందుకే నేను వదిలేస్తున్నానంటూ ఒక లేఖ రాశారు హరి రామజోగయ్య.. అంతేకాకుండా నేను వైసీపీ కోవర్టు ఎలా అయ్యానో చెప్పాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ నిలదీసినట్లు తెలుస్తోంది.. కేవలం తన అంచనా ప్రకారం జనసేన 40 స్థానాలు ఇస్తే బలమైన అభ్యర్థులు ఉన్నారు వారిని నిలబడితే కాస్త బలం ఉంటుంది అని సూచన మాత్రమే ఇచ్చానని వెల్లడించారు.

అలాంటప్పుడు 24 సీట్లు తీసుకోవడం ఎందుకంటే కూడా ప్రశ్నించారు.. కేవలం మీరు బాగుండాలని ఉద్దేశంతో పాటు బిజెపి ని కూడా మీ కూటమిలోకి కలుపుకోవాలని సూచించారని.. అందుకే నన్ను వైసిపి కోవర్టు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు.. మీ రాజకీయ జీవితాన్ని నిర్వీర్యం చేయడమే టిడిపి లక్ష్యం అంటూ తెలియజేశారు. తమ రాజకీయ కోసమే టిడిపి మిమ్మల్ని వాడుకొని నాశనం చేస్తుందని ఇప్పటికైనా ఒకసారి పరిశీలించి మిత్రులు ఎవరు శత్రువులు ఎవరో తెలుసుకోండి అంటూ హరి రామ జోగయ్య తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: