హైదరాబాద్ : ఎదురుదాడినే నమ్ముకున్నారా ?

Vijaya


తమ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎదుర్కోవటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదురుదాడిని మాత్రమే నమ్ముకున్నట్లున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ  విషయాన్న కదిపినా అందులో జరిగిన అవకతవకలతో, అవినీతితో తమకేమి సంబంధమని కేసీయార్, కేటీయార్, హరీష్ రావు అండ్ కో ఎదురు ప్రశ్నిస్తుందటమే విచిత్రంగా ఉంది. కేసీయార్ పదేళ్ళ పాలనలో జరిగిన వాటికి కూడా తమకు సంబంధంలేదని వీళ్ళు దులిపేసుకుంటున్నారు. పైగా కాంగ్రెస్  ప్రభుత్వం రాజకీయంగా కక్షసాధింపులకు పాల్పడుతోందని, తెలంగాణాను నాశనం చేస్తోందనే ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు.



ఇపుడిదంతా ఎందుకంటే పార్టీలోని ప్రజాప్రతినిధులు, ఇంజనీరింగ్ నిపుణులను తీసుకుని  కేటీయార్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. నిజానికి కేటీయార్ అయినా కేసీయార్ అయినా హరీష్ అయినా ఇపుడు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు ఏమీలేదు. ఎందుకంటే తమ హయాంలోనే నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లలో కొన్ని పోయిన ఎన్నికల సమయంలో అంటే అక్టోబర్లోనే కుంగిపోయాయి. దాని ఫలితంగా బ్యారేజీ గోడలకు కూడా పెద్ద పగుళ్ళు వచ్చేశాయి.



ప్రమాదాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు అప్పట్లోనే అంటే కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే బ్యారేజీలోని నీటిని బయటకు వదిలేశారు. లేకపోతే పిల్లర్లు కుంగినందుకు, బ్యారేజి గోడలకు పగుళ్ళువచ్చిన కారణంగా నీటి బరువును మోయలేక బ్యారేజి గోడలు బద్దలైపోయే ప్రమాదం ఉంది. అంతటి ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్తగానే నీటిని బయటకు పంపేశారు. ఇదంతా జరిగింది కేసీయార్ హయాంలోనే. బ్యారేజిని అత్యంత నాసిరకంగా నిర్మించారు కాబట్టే పిల్లరు కుంగిపోయాయి. లేదంటే సామర్ధ్యానికి మంచి నీటినిల్వయినా చేసుండాలి. ఏది జరిగినా బాధ్యత తీసుకోవాల్సింది మాత్రం కేసీయారే.



అయితే తన తప్పును ఒప్పుకోకుండా ఇపుడు ఇంజనీరింగ్ నిపుణులు, రేవంత్ రెడ్డి, మంత్రులు చేస్తున్న ఆరోపణలకు కేసీయార్, కేటీయార్, హరీష్ ఎదురుదాడితో నోళ్ళు మూయించాలని చూస్తున్నారు. పిల్లర్ల కుంగుబాటుకు, బ్యారేజి గోడల పగుళ్ళకి తమ బాధ్యతే లేదన్నట్లుగా మాట్లాడుతుండటమే చాలా ఆశ్చర్యంగా ఉంది. పైగా బ్యారేజికి రిపేర్టు చేయించకుండా, రైతులకు నీళ్ళు వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఎదురు ఆరోపిస్తున్నారు. ఇది సరిపోదన్నట్లుగా మేడిగడ్డ బ్యారేజి సందర్శనొకటి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: